వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆసుపత్రిలో జయ: రాష్ట్రం నా అడ్డా, మా ఇంటికి రండి టీ ఇస్తా,సరదా వ్యాఖ్యలు

రాష్ట్రంలో ప్రజలకు పాలన మరింత చేరువ అయ్యేందుకు ఏం చేయాలో చెప్పండి, వాటిని అమలు చేస్తానని, జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందే సమయంలో అడిగేవారని ఆమెకు చకిత్స చేసిన డాక్టర్లు, నర్సుల బృందం.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై :రాష్ట్రంలో పాలన పరిస్థితులపై ఆసుపత్రిలో ఉన్న సమయంలో కూడ జయ ఆలోచించేవారని ఆమెకు వైద్యం అందించిన సమయంలో నెలకొన్న పరిస్థితులను వైద్య బృందం పంచుకొంది. రాష్ట్రంలో ఏ రకంగా ప్రజలకు సేవలు అందించేందుకు పాలనను కొనసాగించాలనే విషయాలపై ఆమె వైద్యులు, నర్సులను అడిగేవారు. ఇంకా ఏం చేయగలిగితే ప్రజలకు పాలన మరింత చేరువ అవుతోందో ఆ విషయాలను తనకు చెబితే తాను వాటిని అమలు చేస్తానని జయలలిత చెప్పేవారని వైద్య బృందం గుర్తుకుతెచ్చుకొంది.

మా ఇంటికి రండి టీ ఇస్తా

ఆపోలో ఆసుపత్రిలో ఇచ్చే కాఫీ ఆమెకు నచ్చేది కాదు. ఈ కాఫీని తాగేందుకు ఆమె ఇష్టపడేవారు కాదని వైద్యులు చెప్పారు. అయితే తనకు వైద్య చికిత్స అందించిన డాక్టర్లు, నర్సుల బృందం అంతా తన ఇంటికి రావాలని ఆమె కోరారు. మీ అందరికి మంచి టీ ఇస్తానని ఆమె చెప్పారట తన ఇంట్లో కొడైనాడు నుండి తెప్పించి మంచి టీ ఇస్తానని ఆమె తమకు చెప్పారని క్రిటికల్ కేర్ నిపుణుడు డాక్టర్ రమేష్ వెంకటరామన్ గుర్తు చేశారు.

ఆమె కోసం 16 మంది నర్సులు

ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో జయలలితకు మూడు షిఫ్టుల్లో 16 మంది నర్సులు పనిచేసేవారు. అయితే వారిలో షీలా, ఎంవి రేణుక, చాముండేశ్వరీ అంటే జయలలితకు చాలా ఇష్టమని వైద్యులు చెప్పారు. 75 రోజుల పాటు ఆసుపత్రిలో ఆమె ఉంది అయితే ఎక్కువ రోజులు చికిత్స అందించే వైద్యులు, నర్సులతో ఆమె చాలా సరదాగా గడిపేవారని వారు గుర్తు చేసుకొన్నారు.ఆరోగ్యం సహకరించని కొన్ని సందర్భాల్లో ఆమె ఇబ్బంది పడేవారని వారు చెప్పారు. రాష్ట్రంలో పాలనను మెరుగుపర్చేందుకు ఇంకా ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి, అదే చేస్తాను అని ఆమె తనను అడిగారని షీలా అనే నర్స్ గుర్తుకు తెచ్చుకొన్నారు.ఆసుపత్రి నుండి ఇంటికి వెళ్ళిపోతానని ఆమె గాఢంగా నమ్మేవారని ఆమె చె్పారు.

jaya offer tea who treated to her in hospital

రాష్ట్రం నా అడ్డా

ఆసుపత్రిలో జయకు చికిత్స చేసేందుకు లండన్ నుండి వచ్చిన రిచర్డ్ బాలే ఒకనొక సందర్భంలో ఆమెతో గట్టిగానే మాట్లాడారట. ఈ ఆసుపత్రిలో తానే బాస్ నని, తాను చెప్పినట్టు వినాలని ఆమెను కోరితే, ఈ రాష్ట్రం అంతా నా అడ్డా అని ఆమె సైగ చేసి చెప్పారట, అప్పటికే ఆమె చాలా నీరసంగా , అస్సలు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారని వైద్యులు చెప్పారు. అయినా తన రాజసాన్ని ఆమె ఏ మాత్రం వదులుకోలేదన్నారు.

ఉప్మా అంటే ఇష్టం

ఆసుపత్రిలో ఉన్న సమయంలో భోజనం చేయడానికి ఆమె అంతగా ఇష్టపడేవారు కాదట,. అయితే ఆసుపత్రిలో చికిత్స అందించే డాక్టర్లు, నర్సుల బృందం బలవంతం మీద ఆమె భోజనం చేసేవారని వారు గుర్తుచేశారు. ఉప్మా, పొంగల్, దద్దోజనం, బంగాళాదుంప కూర అంటే ఆమెకు చాలా ఇష్టమని వారు చెప్పారు. జయ వ్యక్తిగత కుక్ ఆమె కోసం ఈ వంటలను ప్రత్యేకంగా తయారు చేసి వడ్డించేవాడు.

ఉప ఎన్నికల ఫలితాలను వీక్షించిన జయ

ఆమె ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే తమిళనాడు రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల ఫలితాలు సెప్టెంబర్ 22వ, తేదిన వచ్చాయి. ఈ ఎన్నికల్లో అన్నాడిఎంకె విజయం సాధించింది. అర్వకురుచ్చి, తిరుపరంకుంద్రమ్, తంజావూర్ స్థానాల్లో అన్నా డిఎంకె విజయం సాధించింది. ఈ ఫలితాలను ఆమె టివిలో చూసి చిన్నగా నవ్వారని ఆ సమయంలో ఆమెకు చికిత్స అందించిన డాక్టర్ సత్యభామ చెప్పారు.

శాండ్ విచ్ , కాఫీ అడిగారు

సెప్టెంబర్ 22వ, తేది రాత్రి సమయంలో ఆమెను ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ విభాగంలోకి తీసుకువచ్చారు. నాలుగు గంటల తర్వాత ఆమె పరిస్థితి స్థిరంగా ఉండడంతో ఆమె లేచి కూర్చున్నారు. శాండ్ విచ్ , కాఫీ కావాలని అడిగారు. ఆ రోజు మినహా మిగిలిన అన్ని రోజుల పాటు ఆమె ఆరోగ్యం అంతగా సహకరించలేదని వైద్యులు చెప్పారు.మహిళా డాక్టర్ల హెయిర్ స్టైల్స్ మార్చుకోవాలని ఆమె సూచించేవారట. తమ మీద తాము శ్రద్ద తీసుకోవాలని ఆమె మహిళ డాక్టర్లను కోరేవారట.

నాటకాలు చూసేవారు

అంతా మంచిగా జరుగుతోందని అనుకొన్న సమయంలోనే తలకిందులైపోయిందని వైద్యులు చెప్పారు. ఆదివారం సాయంత్రం సాయంత్రానికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది.ఆమె తమిళ నాటకాన్ని చూస్తున్న సమయంలోనే ఆమె గుండె పోటు వచ్చిన విషయాన్ని గుర్తించారు. ఆమె గదిలోకి వెళ్లిన వైద్యసిబ్బందిని చూసి కూడ ఆమె స్పందించలేదు. వెంటనే వెంటలేటర్ సరిచేస్తే గుండెపోటు వచ్చిన విషయాన్ని గుర్తించారు. మరునాడే ఆమె మరణించిందని వారు గుర్తుచేశారు.

English summary
Jayalalita offer tea who treated to her in hospital, she like coffee but, hospital coffee not good, so she talk to doctor , pl come to my home i will be arrang good tea for all your staff said doctor. she watching in hospital old dramas, she asked medical team what kind of administration changes want to the
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X