ఆసుపత్రిలో జయలలిత: వారం రోజులుగా లేని హెల్త్ బులెటిన్
చెన్నై: గత నెల 22వ తేదీ నుంచి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం పైన గత ఆరు రోజులుగా హెల్త్ బులెటిన్ విడుదల కావడం లేదు. దీంతో అమ్మ ఆరోగ్యం పైన అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
జయలలిత ఆరోగ్యం పైన అక్టోబర్ 10వ తేదీన చివరిసారి హెల్త్ బులెటిన్ విడుదలయింది. ఆ బులెటిన్‌లో అమ్మ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం నాడు సింగపూర్ నుంచి కొత్త ఫిజియోథెరఫిస్ట్ వచ్చారు. ఎయిమ్స్ డాక్టర్లు ఆమెను పర్యవేక్షిస్తున్నారు.

కాగా, ఆదివారం నాడు సూపర్ స్టార్ రజినీకాంత్ అపోలో ఆసుపత్రిని సందర్శించారు. అమ్మ ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అతను ఆదివారం సాయంత్రం ఆరుంపావుకు వచ్చారు. దాదాపు ఇరవై అయిది నిమిషాలు ఆయన ఆసుపత్రిలో గడిపారు. అయితే అమ్మను చూసేందుకు రజనీకాంత్‌కు అనుమతి లభించలేదు.
కేంద్రమంత్రి పోన్ రాధాకృష్ణన్ అమ్మ ఆరోగ్యం పైన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ జయలలిత ఆరోగ్యం గురించి వాకబు చేశారని చెప్పారు. ప్రధాని మోడీ త్వరలో చెన్నైకి వస్తారని, అమ్మను పరామర్శిస్తారని చెప్పారు. కాగా, మోడీ వస్తారని గతంలోను వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications