శశికళనే టార్గెట్: జయ చెల్లె కూతురు సంచలన వ్యాఖ్య
జయలలిత మృతిపై పలువురు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నేరుగా పేరు చెప్పపోయినప్పటికీ ప్రతి ఒక్కరూ శశికళను టార్గెట్ చేసినట్లు అనిపిస్తోంది. అసలు రహస్యం మాత్రం తెలియడం లేదు.
చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సినీ నటి గౌతమి నుంచి జయలలిత చిన్న చెల్లె కూతురు అమృత వరకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, అందరూ శశికళను టార్గెట్ చేసినట్లు కనిపిస్తున్నారు.
జయలలిత చిన్న చెల్లి కూతురు అమృత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె బెంగళూరులో ఉంటోంది. తమ ఆంటీతో మాట్లాడనివ్వకుండా శశికళ కుట్రపూరితంగా వ్యవహరించేదని అమృత చెప్పింది. జయలలిత ఆసుపత్రిలో ఉండగా చూడటానికి తాను మూడు సార్లు వెళ్లానని, ఒక్కసారి కూడా శశికళ తనను లోపలికి అనుమతించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

జయలలిత ఆస్తిని ప్రభుత్వ పరిధిలోకి తెచ్చి తమిళనాడు ప్రజలకు దక్కేలా చూడాలని, అప్పుడే ఆమె ఆత్మకు శాంతి చేకూరుతుందని అమృత అంటోంది. జయలలిత ఆస్తి దక్కించుకోవాలని శశికళ కుట్ర పన్నిందని అమృత సంచలన ఆరోపణలు చేశారు.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కేసును బెంగళూరుకు తరలించడం వెనుక 'మన్నార్‌గుడి మాఫియా' కీలక పాత్ర పోషించిందనే ఆరోపణలు మళ్లీ తెర మీదికి వచ్చాయి. ఆమె నుంచి అధికారాన్ని చేజిక్కించుకునే వ్యూహంలోనే శశికళ ఆ దిశగా పావులు కదిపినట్టు తెహల్కా రిపోర్టర్ జీమన్ జాకబ్ 2012లో రాసిన కథనంలో ఆరోపించారు. జయలలిత మృతిపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో నాలుగేళ్ల నాటి ఈ కథనానికి మళ్లీ ప్రాధాన్యం ఏర్పడిందంటూ వార్తాకథనాలు వెలువడ్డాయి.
తెహెల్కా 2012లో ప్రచురించిన సంచలన కథనం జయలలిత మృతి వెనుక కుట్ర జరిగిందన్న వాదనలకు బలం చేకూరుస్తోందంటూవార్తాకథనాలు వెలువడ్డాయి.












Click it and Unblock the Notifications