వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత కాళ్లు తొలగింపు?: వివరణ ఇచ్చిన అపోలో ఛైర్మన్ ప్రతాప్

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు అందించిన వైద్యానికి సంబంధించి వివరాలు వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నామని అపోలో ఆస్పత్రుల ఛైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డి స్పష్టం చేశారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు అందించిన వైద్యానికి సంబంధించి వివరాలు వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నామని అపోలో ఆస్పత్రుల ఛైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డి స్పష్టం చేశారు. జయలలితకు అందించిన చికిత్సను ఎప్పటికప్పుడు వెల్లడించామని చెప్పారు.

jayalalithaa

చెన్నైలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ప్రతాప్‌ సి రెడ్డి సమాధానమిచ్చారు. జయలలిత మృతిపై వస్తున్న ఊహాగానాలను ఆయన ఖండించారు. జయలలిత కాళ్లను తొలగించినట్లు వస్తున్న వార్తలన్నీ వదంతులేనని స్పష్టం చేశారు.

జయలలిత మరణానికి సంబంధించిన అన్ని వివరణలను ఆసుపత్రి యంత్రాంగం తరఫున ఇప్పటికే బహిర్గతం చేశామన్నారు. సీబీఐ దర్యాప్తు చేసినా సమగ్ర వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రతాప్ సి రెడ్డి తెలిపారు. కాగా, జయలలిత మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

English summary
Apollo Hospitals Chairman Prathap C. Reddy on Friday debunked reports as rumours devoid of any truth reports that the legs of former chief minister J. Jayalalithaa were amputated due to diabetic related complications before her death on December 5 last year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X