జయ ప్రతి నిర్ణయం వెనుక అసలు రహస్యం ఇదే !

చెన్నై: తమిళనాడులో దాదాపుగా ప్రజలు అందరూ జయలలితను ప్రేమగా అమ్మా అని పిలుచుకుంటారు. అయితే అదే అమ్మకు చాల సెంటిమెంట్ ఉంది అనే విషయం చాల మందికి ఇప్పటికీ తెలీదు.

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రంపై అపార విశ్వాసం ఉందనే విషయం చాల కొద్ది మందికే తెలుసు. జ్యోతిష్యులను సంప్రదించకుండా జయలలి ఇంత వరకు ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోలేదు. ఇదే అసలు నిజం.

ఏ పని చెయ్యాలన్నా చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా అన్ని నిర్ణయాలు తీసుకునే ముందు పంచాంగాన్ని బట్టి ఆమె అంతిమ నిర్ణయం తీసుకునేవారు. తమిళనాడు సీఎంగా జయలలిత ఏ పథకాన్ని ప్రారంభించినా ముందుగా జ్యోతిష్యులను సంప్రదించేవారు.

Jayalalithaa was declared dead at Apollo hospital in Chennai

జ్యోతిష్యుల సలహాలు, సూచనల మేరకు ఓ తేదీ, సమయం, స్థలం నిర్ణయించేవారు. అన్నీ పక్కాగా కుదిరితేనే ఆ పనికి శ్రీకారం చుట్టేవారు. ఎదైనా అపశకునం అని ఆమెకు అనిపిస్తే వెంటనే ఆపనికి చెక్ పెట్టి మరోజు చూసుకునే వారు.

చివరికి ముహూర్తం సరిగా లేదని తెలుసుకున్న జయలలిత చివరి నిమిషంలో తన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఇలా అన్ని పరిశీలిస్తే జయలలితకు జోతిష్యం పైన ఎంత నమ్మకం ఉందో ఇట్లే అర్థం అవుతుంది.

2001లో జయలలిత తన పేరులో అదనంగా ఓ ఆంగ్ల అక్షరం వచ్చే విధంగా 'ఏ' అనే అక్షరం చేర్చుకున్నారు. అంత కాలం ఆంగ్లంలో Jayalalitha అని ఉండే పేరుకు మరో ఏ చేర్చుకోవడంతో తరువాత Jayalalithaa అయ్యింది.

ఆంగ్లంలో 11 అక్షరాలు ఉన్న తన పేరును 12 అక్షరాలు వచ్చే విధంగా చేసుకున్నారు. జ్యోతిష్యుల సూచనల మేరకు జయలలిత ఈ నిర్ణయం తీసుకున్నారని తరువాత వెలుగు చూసింది.

జయలలిత జాతకం ప్రకారం ఆమెకు 5, 7 అంకెలు అనుకూలమైనవి. అయితే ఆమెకు అనుకూలమైన 5వ తేది (డిసెంబర్ 5) తుదిశ్వాస విడిచారు. జయలలిత విశ్వాసాలు, ఆమె నమ్మకాలు, జాతకాలకు తగినట్లే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

జయలలిత అష్టమి రోజు ఎలాంటి శుభకార్యాలు చెయ్యరు. ఆరోజు దాదాపుగా అన్ని కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉంటారు. డిసెంబర్ 7వ తేది బుధవారం జయలలిత అంత్యక్రియలు చెయ్యాలని మొదట భావించారు.

అయితే బుధవారం అష్టమి కావడంతో ఆరోజు అమ్మ అంత్యక్రియలు నిర్వహించరాదని ఆమె సన్నిహితులు నిర్ణయించారు. అందు వలనే డిసెంబర్ 6వ తేది మంగళవారం సాయంత్రం 4.30 గంటల తరువాత అమ్మ అంత్యక్రియలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+