రైలులో ఎమ్మెల్యే వేధింపులు, పార్టీ నుంచి సస్పెన్షన్
పాట్నా: రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులోదంపతులను వేధించిన బీహార్ ఎమ్మెల్యే సర్ఫరాజ్ అలామ్‌ను జెడియు పార్టీ నుంచి బహిష్కరించింది. అలాగే వారి పట్ల ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు గర్హనీయమని పేర్కొంది. అలామ్‌ను పార్టీ నుంచి తొలగిస్తున్నామని జేడీయూ అధ్యక్షులు శరద్ యాదవ్ ప్రకటించారు.
వారం రోజుల క్రితం జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శనివారం ఉదయం మౌనం వీడారు. ఎంపీ, ఎమ్మెల్యే ఎవరైనా సరే చట్టానికి అతీతులు కాదని, శాసనాన్ని అతిక్రమించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకునే స్వేచ్ఛ పోలీసులకు ఉందని చెప్పారు.
ఆర్జేడీ ఎంపీ మొహమ్మద్ తస్లిముద్దిన్ కుమారుడైన అలామ్ జకిహాత్ నియోజకవర్గం నుంచి మూడోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జనవరి 17న రాజధాని ఎక్స్‌ప్రెస్ రైల్లో ప్రయాణిస్తున్న దంపతులతో అలామ్ అసభ్యంగా ప్రవర్తించారు.

ఆ సమయంలో ఆయన టికెట్ లేకుండా ప్రయాణించడమే కాకుండా మద్యం సేవించి ఉన్నాడు. ఈ ఘటనపై దంపతులు పట్నా రైల్వే పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో తన వాంగ్మూలం ఇచ్చేందుకు అలామ్ శనివారం పాట్నా రైల్వే పోలీసుల ముందు హాజరయ్యారు.
మరోవైపు, డిబ్రుగడ్ - న్యూఢిల్లి రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో తాను దంపతులను లేదా మహిళను వేధఇంచలేదని ఆలం పోలీసులతో అన్నారు. అయితే, అంతకుముందు ఆ రైలులో తాను ప్రయాణించలేదని చెప్పిన ఎమ్మెల్యే ఆ తర్వాత నిజం అంగీకరించారు. పోలీసులు అతనిని 4 గంటల పాటు ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications