అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఉధృతి పెరిగిన వేళ- ఆసుపత్రిలో కర్ణాటక మాజీ సీఎం

బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. మొత్తం 224 నియోజకవర్గాలకు మే 10వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. అదే నెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఏ పార్టీ అనేది ఆ రోజున తేలిపోతుంది.

ఈ నేపథ్యంలో అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్).. సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నాయి. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ కసరత్తు చేస్తోంది. వరుసగా సీనియర్ నాయకులు రాజీనామా చేస్తోండటం ఆ పార్టీకి మింగుడుపడట్లేదు.మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవాది సహా ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గుడ్‌బై చెప్పారు.

వారంతా కాంగ్రెస్, జేడీఎస్‌లల్లో జాయిన్ అయ్యారు. అటు జేడీఎస్ అధినాయకత్వం జిల్లాల్లో విస్తృతంగా పర్యటనలు సాగిస్తోంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి- ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోన్నారు. ఓల్డ్ మైసూరు రీజియన్‌లో జేడీఎస్‌కు చెక్కు చెదరని ఓటుబ్యాంక్ ఉంది. ఈ రీజియన్‌లో మెజారిటీ స్థానాలను గెలుచుకోవడంపై దృష్టి సారించింది.

Kumaraswamy

ఉత్తర కర్ణాటకలోని రాయచూర్, దావణగెరె, బాగల్‌కోట్, బీదర్, బళ్లారి, విజయపురాలపై పట్టు సాధించడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందులో భాగంగా కుమారస్వామి పలుమార్లు ఆయా జిల్లాల్లో పర్యటించారు. మఠాధిపతులను కలుసుకున్నారు. గ్రామీణ నియోజకవర్గాలపై ప్రధానంగా ఆయన ఫోకస్ పెట్టారు. సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తూ వస్తోన్నారు.

హసన్ జిల్లాలో తన తండ్రి హెచ్‌డీ దేవేగౌడతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో కుమారస్వామి అనారోగ్యానికి గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్నారు. దీనితో ఆయనను బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు.

జ్వరంతో బాధపడుతున్నారని, దాని తీవ్రత తగ్గిందని వివరించారు. విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని అన్నారు. జ్వరం తగ్గిన తరువాత మళ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని కుటుంబ సభ్యులు చెప్పారు. తన ఆరోగ్యం బాగుందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందవద్దని కుమారస్వామి చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+