ఇన్సూరెన్స్ డబ్బు కోసం 2. 7 కేజీల బంగారు నగలు, జ్యువెలరీ షాప్ ఓనర్ స్కెచ్ !
బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరు నగరంలో కోట్ల రూపాయాల వ్యాపారం చేస్తున్న వ్యాపారులు వారి షాపులు, షోరూమ్ లకు ఇన్సూరెన్స్ చేస్తుంటారు. ముఖ్యంగా జ్యువెలర్స్, ఎలక్ట్రిక్ షాపులు, షోరూమ్ లు, కోట్లలో వ్యాపారాలు చేస్తున్న బట్టల వ్యాపారులు, హోల్ సేల్ వ్యాపారులు ఇాలా అన్ని రంగాల్లో నిత్యం రూ. కోట్లలో టర్నోవర్ చేస్తున్న హోల్ సేల్ వ్యాపారులు వారి షాపులు, షోరూమ్ లు, గౌడన్ లకు ఇన్సూరెన్స్ చేస్తుంటారు.
2.7 కిలోల బంగారం చోరీ కేసులో ఫిర్యాదు చేసిన జ్యువెలరీ షాప్ యజమానినే పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. మార్కెట్ ఫ్లైఓవర్ సమీపంలో చోరీ జరిగిందని షాపు యజమాని కే
పెట్టాడు. కైలాష్ జ్యువెలరీ షోరూమ్ యజమాని రాజేష్ జైన్ అలియాస్ రాజు జైన్ అరెస్టు అయిన నిందితుడు. సిటి మార్కెట్ సమీపంలోని నగరత్ పేట్ లో రాజు జైన్ కైలాష్ జ్యువెలర్స్ అనే నగల దుకాణానికి యజమాని. పోలీసుల విచారణలో బీమా క్లెయిమ్ కోసం తాను అందరిని మోసం చేశానని రాజు జైన్ అంగీకరించాడని పోలీసులు అన్నారు.

ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం రాజు జైన్ అతనికి కావలసి వారిని ఉపయోగించుకుని దొంగతనం చేయించి డ్రామాలు ఆడాడని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు నగల యజమాని రాజు జైన్ ను పిలిచి విచారించారు. అప్పటికే ఈ కేసు కొలిక్కి వచ్చిందని తెలుసుకున్న నగల వ్యాపారి రాజు జైన్‌లో వణుకు మొదలైంది. పోలీసులు తమదైన శైలిలో రాజు జైన్ కు బెండ్ తీసి విచారణ కొనసాగించగా తానే నేరం చేశానని నగల యజమాని ఒప్పుకున్నాడని పోలీసులు అన్నారు.

బీమా క్లెయిమ్ కోసం ఈ చోరీ డ్రామా ఆడినట్లు నగల యజమాని రాజు జైన్ అంగీకరించాడు. ప్రస్తుతం కాటన్ టౌన్ పోలీసులు షాపు యజమాని రాజు జైన్ తో పాటు ఇద్దరు బాల నేరస్తులను అరెస్ట్ చేసి అరెస్ట్ చేసిన వారి నుంచి 2.7 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద ఇన్సూరెన్స్ డబ్బు కోసం బాలనేరస్తులతో కలిసి కన్నింగ్ స్కెచ్ వేసిన జ్యువెలరీ షాప్ యజమాని రాజు జైన్ అరెస్టు కావడంతో బెంగళూరులోని సాటి జ్యువెలరీ షాప్ యజమానులు షాక్ అయ్యారు.












Click it and Unblock the Notifications