జార్ఖండ్: సిఎం సహా ముగ్గురు మాజీ సిఎంలు వెనకంజ
రాంచీ: జార్ఖండ్ శానససభ ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌తో పాటు ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు పోటీలో ఉన్నరాు. వీరు నలుగురు కూడా వెనకంజలో ఉన్నారు. దుమ్కా నియోజకవర్గంలో హేమంత్ సొరేన్ కొద్ది వేల ఓట్ల వెనకంజలో సాగుతున్నారు. బర్హైత్ స్థానంలో మాత్రం ఆయన విజయం సాధించారు. రాష్ట్రంలోని 24 కేంద్రాల్లో మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా వెనకంజలో ఉన్నారు. జెఎంఎం అభ్యర్థి దశరథ్ గగ్రాయ్ కన్నా ఖార్సావాలో 1290 ఓట్ల వెనకంజలో ఉన్నారు. జార్ఖండ్‌లో బిజెపి గాలి వీస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అది సాగుతోంది.

దుమ్కా అసెంబ్లీ నియోజకవర్గంలో హేమంత్ సొరేన్ 3 వేల ఓట్ల వెనకంజలో ఉన్నారు. జివిఎం- పి బాస్, మాజీ ముఖ్యమంత్రి బాబులాల్ మారండీ కూడా వెనకంజలో సాగుతున్నారు. గిరిధ్ నియోజకవర్గంలోనే కాకుండా రాజ్ ధాన్వార్ సీట్లో కూడా ఆయన వెనకంజలో ఉన్నారు. బిజెపి అభ్యర్థి నిర్భయ్ షాబాదీ గిరిధ్ నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ధన్వార్ సీట్లో సిపిఎం అభ్యర్థి రాజ్ కుమార్ యాదవ్ మారండీ కన్నా ఆధిక్యంలో ఉన్నారు. సిపిఎం అభ్యర్థి దాదాపు 3 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరో మాజీ ముఖ్యమంత్రి మధు కొడా తన సమీప జిఎంఎం అభ్యర్థి కన్నా మాజ్‌గావ్ సీట్లో నిరల్ పూర్తి కన్నా వెనకంజలో ఉన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌తో పాటు మిగతా ముగ్గురు మాజీ ముఖ్యమంత్రుల భవితవ్యం కొద్ది వేల ఓట్ల తేడాతోనే ఆధారపడి ఉంటుంది.












Click it and Unblock the Notifications