Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ కూటమి పథకం కాపీ..ఆమెకు పెరుగుతున్న ప్రజాదరణ..!!

జార్ఖండ్‌లో ఎన్నికల వాతావరణం కాక పుట్టిస్తోంది. అక్కడ అధికారిక జేఎంఎం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతుండగా.. బీజేపీ కూడా తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఆయా పార్టీలు ప్రచారపర్వాన్ని హోరెత్తిస్తున్నాయి. సంక్షేమం పై హామీల వర్షం కురిపిస్తున్నాయి.ఇందులో భాగంగా మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇరు పార్టీలు పోటీ పడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ అధికారంలోకి వస్తే 18ఏళ్లు పైబడిన అర్హులైన మహిళలకు రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ హామీపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడు తాజాగా జార్ఖండ్‌లో కూడా మహిళలను ఆకట్టుకునేందుకు పలు మహిళా పథకాలతో పార్టీలు ముందుకొస్తున్నాయి. అధికారిక జేఎంఎం పార్టీ "మైయా సమ్మాన్ యోజన" పథకాన్ని తమ ప్రచారాస్త్రంగా వినియోగిస్తోంది. ఈ పథకాన్ని ప్రజల్లోకి ముందుండి తీసుకెళుతున్నారు సీఎం హేమంత్ సోరెన్ సతీమణి, గండి ఎమ్మెల్యే కల్పనా సోరెన్.

Jharkhand Assembly election 2024 The Rise of Kalpana Soren A Power Player in Jharkhand Politics

మహిళా ఓటర్ల కోసం..

సంక్షేమ పథకంలో భాగంగా ఆగష్టులో మహిళల కోసం మైయా సమ్మాన్ యోజన పథకాన్ని ప్రారంభించారు.18 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు ఉన్న అర్హులైన మహిళలకు ప్రతి నెలా రూ.2500 హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఇస్తోంది. అంతకుముందు ఇది రూ.1000గా ఉండగా సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో మరో 1500 పెంచి రూ.2500 ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.ఇక ఈ పథకం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు నేరుగా రంగంలోకి దిగారు హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్.అయితే ఇది బీజేపీ చేపట్టిన పరివర్తనా యాత్రకు కౌంటర్‌ అని జేఎంఎం వర్గాలు గుసగుసలాడుతున్నాయి. అక్టోబర్ 2వ తేదీన హజారీబాగ్‌లో ముగిసిన బీజేపీ పరివర్తనా ర్యాలీలో ప్రధాని మోద పాల్గొన్నారు. బీజేపీ కూడా మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు గోగో దీదీ యోజన పథకం అమలు చేస్తామని వెల్లడించింది.

Jharkhand Assembly election 2024 The Rise of Kalpana Soren A Power Player in Jharkhand Politics

గోగో దీదీ యోజన పథకం

గోగో దీదీ యోజన పథకం కింద అర్హుత కలిగి ఉన్న ప్రతి మహిళకు రూ.2100 ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.1.26 కోట్ల మంది ఓటర్లున్న జార్ఖండ్‌లో 2.59 లక్షల మంది మహిళా ఓటర్లున్నారు. వీరిని ఆకట్టుకునేందుకు పార్టీలు పలు సంక్షేమ పథకాలపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఇక జేఎంఎం విషయానికొస్తే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి బేబీ దేవి ఈ మహిళా పథకంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండగా... ఆ తర్వాత సీఎం సతీమణి కల్పనా సోరెన్ అయితే బాగుంటుందని భావించారు. సెప్టెంబర్ 23వ తేదీన ప్రారంభమై ఈ యాత్రలో ఇప్పటి వరకు కల్పనా 70 ర్యాలీల్లో పాల్గొని ప్రసంగించారు. ప్రజల నుంచి ఈ పథకం పై అభిప్రాయసేకరణ సైతం చేపట్టారు. ఇక రెండవ విడత యాత్ర బుధవారం నుంచి ప్రారంభం కానుంది.

Jharkhand Assembly election 2024 The Rise of Kalpana Soren A Power Player in Jharkhand Politics

స్టార్ క్యాంపెయినర్‌గా కల్పనా సోరెన్..

కల్పనా సోరెన్ తప్పకుండా తమ నియోజకవర్గాల్లో పర్యటించి ప్రసంగించాలని పార్టీ నేతలు క్యాడర్ కోరుతున్నారు. ప్రచార సమయంలో వేదికపై ఉన్న సీనియర్ నేతల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటున్నారు కల్పనా సోరెన్. ఇది చాలామందిని ఆకట్టుకుంటుండగా.. ఇదొక ఎన్నికల ట్రిక్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడైతే జేఎంఎం బలంగా లేదో అక్కడ కూడా కల్పనా సోరెన్ ఎంట్రీతో జోష్ కనిపిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సాధారణంగా రాజకీయ నేతలు మహిళా సాధికారత గురించి మాట్లాడతారు కానీ జార్ఖండ్‌లో మాత్రం జేఎంఎం మహిళలకు చోటు కల్పించి వారిని నేతలుగ మలుచుతోందని జేఎంఎం నేత ఒకరు అన్నారు. అయితే బీజేపీ మాత్రం సోరెన్ జంటను బంటీ ఔర్ బబ్లీగా అభివర్ణించింది.మహిళలకు గోగూ దీదీ యోజనా తీసుకొచ్చాం కాబట్టే వారు మరో పేరుతో మహిళా పథకం తీసుకొచ్చారని ఆరాష్ట్ర బీజేపీ చీఫ్ బాబూలాల్ మరాండీ ధ్వజమెత్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+