అత్యంత రసవత్తరం: ఊహకు అందని ట్విస్టులు: ఫైనల్‌గా..!!
Jharkhand Assembly Election Results 2024: జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అత్యంత రసవత్తరంగా మారాయి. క్షణక్షణానికి ఉత్కంఠతను రేకెత్తిస్తోన్నాయి. రౌండ్ రౌండ్‌కూ ఆధిక్యత చేతులు మారుతూ వస్తోంది. ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తోన్నాయిక్కడ.
మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 13, 20 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 41. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ఆరంభమైంది. మొత్తం 24 జిల్లాల్లో 24 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల కమిషన్ అధికారులు ఏర్పాటు చేశారు.

ఫలితాలు వెలువడుతున్న కొద్దీ- ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంటోంది జార్ఖండ్‌లో. జార్ఖండ్ ముక్తిమోర్చా- కాంగ్రెస్ సారథ్యంలోని కూటమి, భారతీయ జనతా పార్టీ- ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ కూటమి మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఈ రెండు కూటములు ఒక దశలో 38, 37 నియోజకవర్గాల్లో ఆధిక్యతలో కొనసాగడం కనిపించింది.
ప్రారంభంలో వెనుకంజలో ఉన్న జేఎంఎం, కాంగ్రెస్, సీపీఐ (ఎంఎల్) అభ్యర్థులు ఆ తరువాతి రౌండ్లల్లో ఆధిక్యతను సాధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ తరువాత జేఎంఎం- కాంగ్రెస్ కూటమి పైచేయి సాధించింది. సగానికి పైగా సీట్లల్లో ఆధిక్యతను కనపరిచింది.
ఛతార్‌పూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రాధాకృష్ణ కిశోర్, చందన్‌క్యారీ స్థానం నుంచి జేఎంఎం అభ్యర్థి ఉమాకాంత్ రజక్ తమ ప్రత్యర్థులు, బీజేపీ అభ్యర్థులపై ఆధిక్యత సాధించారు. ఛాయ్‌బస, బొరియో స్థానాల్లో జేఎంఎం అభ్యర్థులు దీపక్ బిరువా, ధనంజయ్ సోరెన్ భారీ ఆధిక్యతను సాధించారు. దియోఘర్‌లో ఆర్జేడీ అభ్యర్థి సురేష్ పాశ్వాన్ 13,000కు పైగా ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు.












Click it and Unblock the Notifications