జార్ఖండ్ కీలక అసెంబ్లీ స్థానాల్లో పోటీ పడుతున్న మహిళా నేతలు వీరే

జార్ఖండ్ రాష్ట్రంలో త్వరలో జరగనన్న అసెంబ్లీ ఎన్నికల్లో కీలక స్థానాల నుంచి మహిళా నేతలు పోటీ పడుతున్నారు. ఈ జాబితాలో గాండే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా మునియా దేవీ పోటీ చేస్తున్నారు. దీంతో ఆమె తన ప్రత్యర్థి అయిన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పన సోరెన్‌తో పోటీ పడనున్నారు. గాండే స్థానం నుంచి కల్పనా సోరెన్ పోటీ చేస్తుండటంతో ఈ సీటుకు ప్రాధాన్యత సంతరించుకుంది.

భూ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో జనవరి 31న హేమంత్ సోరెన్ అరెస్ట్ అయిన తర్వాత కల్పనా సోరెన్‌కు మార్గం సుగమం చేసేందుకు సర్ఫరాజ్ అహ్మద్ రాజీనామా ఈ స్థానం నుంచి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయనను రాజ్యసభకు పంపింది జేఎంఎం. దీంతో గత మే నెలలో గాండే స్థానంకు జరిగిన ఉపఎన్నికలో కల్పనా సోరెన్ బరిలో దిగి విజయం సాధించారు.

Jharkhand Assembly Elections Four Seats To Witness Woman Vs Woman Fight

గిరిది జిల్లా కౌన్సిల్ ఛైర్ పర్సన్ అయిన బీజేపీ అభ్యర్థి మునియా దేవీతో కల్పనా సోరెన్ ప్రస్తుతం పోటీ పడుతున్నారు. ఆసక్తికరంగా, మునియా దేవి 2010 వరకు గృహిణిగా ఉన్నారు, ఆమె జిల్లా పరిషత్ సభ్యులుగా ఎన్నికైన తరువాత జమువా తూర్పు నుంచి 2010-11లో జిల్లా పరిషత్ అధ్యక్షురాలయ్యారు. ఆమె జిల్లా పరిషత్ సభ్యురాలిగా తిరిగి ఎన్నికయ్యారు. 2022లో జిల్లా పరిషత్ అధ్యక్ష పదవిని మళ్లీ అలంకరించారు.

ఇంకా, డుమ్రి, రాంగఢ్, ఝారియా స్థానాల్లోనూ మహిళా నేతలు పోటీలో ఉన్నారు. ఝరియాలో, ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కోడలు, పూర్ణిమ నీరజ్ సింగ్, రాగిణి సింగ్ ఒకరినొకరు ఎదుర్కోనున్నారు. కాంగ్రెస్‌ నేత నీరజ్‌ సింగ్‌ హత్య నేపథ్యంలో ఆయన భార్య పూర్ణిమ నీరజ్‌ సింగ్‌, ఝరియా ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ తరపున పోటీకి దిగారు.

ఇక, నీరజ్ సింగ్ హత్యకేసులో జైలులో ఉన్న సంజీవ్ సింగ్ భార్య రాగిణి సింగ్ బీజేపీ అభ్యర్థి. డుమ్రీలో, జేఎంఎం మాజీ మంత్రి జగర్‌నాథ్ మహ్తో భార్య, జేఎంఎం బేబీ దేవి AJSUకి చెందిన యశోదా దేవితో నేరుగా పోటీ పడుతున్నారు. గత సంవత్సరం, 2019 అసెంబ్లీ ఎన్నికలలో BJP, AJSU విడివిడిగా పోటీ చేసినప్పుడు యశోదా దేవి కూడా AJSU బ్యానర్ క్రింద ఈ స్థానంలో పోటీ చేసి, JMM దివంగత జగర్‌నాథ్ మహ్తో తర్వాత రెండవ స్థానంలో నిలిచారు. మహిళా నేతల తమ గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తమదే విజయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+