యాపిల్ కు పోటీగా జియో ట్రాకింగ్ డివైజ్
పర్సులు, వ్యాలెట్లు, కారు తాళంచెవి, ల్యాప్‌టాప్, బ్యాగ్ వంటి వస్తువులకు ఈ ట్యాగ్‌ను యాడ్ చేస్తే అవి ఎక్కడున్నాయో సులువుగా గుర్తించడానికి వీలవుతుంది. మార్కెట్లో , శామ్‌సంగ్, యాపిల్ కంపెనీల ట్యాగ్‌లు అందుబాటులో ఉన్నాయి. ధర ఎక్కువ. దీన్ని దృష్టిలో ఉంచుకొని తక్కువ ధరలో జియో ట్యాగ్ ను రిలయన్స్ ప్రవేశపెట్టింది. బ్లూటూత్ కనెక్షన్ తో పనిచేస్తుంది. వినియోగదారులకు బ్లూటూత్ ట్రాకర్ లా పనిచేస్తుంది. ఓపెన్ ప్లేస్ లో ఉన్నప్పుడు 50 మీటర్ల వరకు జియో ట్యాగ్ రేంజ్ ఉంటుంది.
వస్తువు కచ్చితమైన లోకేషన్ ను గుర్తిస్తుంది. ఇండోర్ లో అయితే జియో ట్యాగ్ రేంజ్ 20 మీటర్లు. బ్లూటూత్ 5.1వెర్షన్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ వైట్ కలర్ లో ఉంటుంది. 9.5 గ్రాముల బరువుంటుంది. అంతేకాకుండా మన ఫోన్ సైలెంట్ లో ఉన్నట్లయితే ఈ డివైజ్ సాయంతో రింగ్ చేయవచ్చు. జియో ట్యాగ్ డివైజ్ పై డబుల్ ట్యాప్ చేస్తే కనెక్ట్ అయివున్న ఫోన్ రింగవుతుంది. దీనికి ముందుగా స్మార్ట్ ఫోన్ ను కనెక్ట్ చేసుకోవాలి.

జియో థింగ్స్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని ఆ తర్వాత దాన్ని సెటప్ చేసుకోవాలి. డివైజ్‌ను పోగొట్టుకున్నా అదెక్కడ పోయిందో తెలుసుకునే వీలుంటుంది. ఫైండ్ మై నెట్‌వర్క్ లాగే జియో కమ్యూనిటీ నెట్‌వర్క్ అనే ఆప్షన్ సహాయంతో దీన్ని కనుక్కోవచ్చు. జియో థింగ్స్ యాప్‌లోనే ఈ ఫీచర్ ఉంటుంది.
చివరగా ఏ లొకేషన్‌లో డివైజ్ కనెక్షన్ పోయిందో ఇందులో తెలుసుకొని అక్కడికి వెళ్లి వెదుక్కోవచ్చు. యాపిల్ ఎయిర్ ట్యాగ్ తో పోలిస్తే ధర చాలా తక్కువ. రిలయన్స్ స్టోర్స్ తోపాటు జియో వెబ్ సైట్ లో రూ.749కే లభిస్తోంది. ఎమ్మార్పీ ధర రూ.2499, యాపిల్ ఎయిర్ ట్యాగ్ రూ.3490గా ఉంది. దీంట్లో ఎక్స్ ట్రా బ్యాటరీ వస్తుంది. డివైజ్ ను వస్తువులతో ట్యాగ్ చేసేందుకు వీలుగా ఓ వైరు కూడా లభిస్తుంది.












Click it and Unblock the Notifications