వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశద్రోహం కేసు: విద్యార్థులకు మధ్యంతర జామీను

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ వ్యతిరేక నినాదాలు చేశారని ఆరోపణలపై రాజద్రోహం అభియోగాలు ఎదుర్కోంటున్న జేఎన్ యూ విద్యార్థులు అనిర్బన్ భట్టాచార్య, ఉమర్ ఖలీద్ లు శుక్రవారం రాత్రి మధ్యంతర జామీను పై విడుదలయ్యారు. ఫిబ్రవరి 9వ తేదిన జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో దేశ వ్యతిరేక నినాదాలు చేశారని ఇద్దరూ అరెస్టు అయ్యారు.

ఈ ఇద్దరు విద్యార్థులకు ఢిల్లీ అదనపు సెషన్స్ న్యాయస్థానం ఆరు నెలల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రూ. 25 వేల చొప్పున వ్యక్తిగత బాండు, అంతే మొత్తంలో ష్యూరిటీ సమర్పించి బెయిల్ పొందాలని 12 పేజీల ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదే సంవత్సరం సెప్టెంబర్ 19 వరకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని తెలిపింది.

కోర్టు అనుమతి లేనిదే ఢిల్లీ వదిలి వెళ్లరాదని, కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు పిలిచినప్పుడల్లా విచారణకు హాజరుకావాలని షరతులువిధించింది. కోర్టు ఆదేశాల మేరకు జేఎన్ యూ సెంటర్ ఫర్ హిస్టారికల్ స్టడీస్ అధ్యాపకులు సంగీతా దాస్ గుప్తా, రజత్ దత్తాలు వీరిద్దరికి ష్యూరిటీలు సమర్పించారు.

నిందితులపై మోపిన అభియోగాలు తీవ్రమైనవే అని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. వీరిద్దరూ దేశ వ్యతిరేక నినాదాలు చేసినట్లు పోలీసులు సమర్పించిన వీడియో ఫుటేజీ ప్రస్తుతం ఫోరెన్సిక్ లేబొరేటరీ పరిశీలనలో ఉందని, నిందితులు పారిపోయే అవకాశం ఉందని పోలీసులు ఎటువంటి కారణాలు చూపలేదని కోర్టు తెలిపింది.

JNU- Anirban Bhattacharya, Umar Khalid get bail

ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ కు హై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపధ్యంలోనే వీరిద్దరికి ఆరు నెలలు బెయిల్ మంజూరు చెయ్యడం సరైనదే అని తాను భావిస్తున్నానని జడ్జి రీతేష్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

నిందితులకు బెయిల్ మంజూరు చెయ్యరాదని పోలీసులు కోర్టులో మనవి చేశారు. అయితే పోలీసుల వాదనలను కోర్టు విభేదించింది.
ఈ కేసులో వీరు దోషులుగా తేలితే జీవిత ఖైదుతో సహ మూడు రకాల శిక్షలు పడే అవకాశం ఉందని న్యాయస్థానం తెలిపింది. విద్యార్థులకు బెయిల్ రావడంతో జేఎన్ యూలో సంబరాలు జరుపుకున్నారు.

English summary
The students have been ordered not to leave Delhi without the court's permission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X