సీఎంపై కామెంట్స్: జర్నలిస్టు బుక్కయ్యాడు
సిమ్లా: ఆయన ఓ ప్రముఖ జర్నలిస్టు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అనుచితంగా వ్యాఖ్యలు చేసి అడ్డంగా బుక్కయ్యాడు. ఆ జర్నలిస్టు మీద వివిద సెక్షల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు.
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కు వ్యతిరేకంగా సిమ్లా నగరానికి చెందిన రాజేశ్ శర్మ అనే జర్నలిస్టు ఫేస్ బుక్ లో కామెంట్స్ చేశాడు. ఈ కామట్స్ చూసిన అనేక మంది వివిద రకాలుగా స్పందిస్తూ వారు కామెంట్స్ చేశారు.

దీంతో గొడవలు మొదలైనాయి. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు ఆ జర్నలిస్టు మీద మండిపడ్డారు. తమ నాయకుడికి వ్యతిరేకంగా ఫేస్ బుక్ లో వ్యాఖ్యలు చేశారని, తమ నేత ప్రతిష్టకు భంగం కలిగేలా రాజేష్ శర్మ వ్యాఖ్యలు చేశాడని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుడు పూరన్ చాంద్ జర్నలిస్టు రాజేష్ శర్మ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. జర్నలిస్టు రాజేష్ శర్మను అరెస్టు చేశామని, అతను ఎందుకు ఈ విదంగా ఫేస్ బుక్ లో వ్యాఖ్యలు ఫోస్ట్ చేశాడు అని విచారిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications