టీనేజ్ బాలికను ఎత్తుకెళ్లి లాడ్జిలో 5 రోజులు రేప్, ఐదుగురి అరెస్ట్
థానే: టీనేజ్ బాలికను ఎత్తుకెళ్లి, అత్యాచారం చేసిన కేసులో పోలీసులు ఓ మైనర్ సహా ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ సంఘటన థానేలో జరిగింది. ఈ నెలలో థానే జిల్లాలోని ముంబ్రాలో అత్యాచారం జరిగిందని, వారిని అరెస్టు చేశామని పోలీసులు ఆదివారం చెప్పారు.
ఈ దారుణ సంఘటన ఫిబ్రవరి 5-9 తేదీల మధ్య జరిగింది. నిందితులు బాధితురాలికి తెలుసని పోలీసులు చెప్పారు. ఆమెకు డ్రగ్స్ ఇచ్చి, అక్కడి నుండి ఎవరు లేని ప్రాంతానికి తీసుకు వెళ్లారని తెలిపారు. అక్కడ ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు.

షిల్ దైగర్, ఖోప్లీ గ్రామాల మధ్య గల ప్రాంతానికి తీసుకు వెళ్లారు. ఐదో తారీఖున ఆమెను ఎత్తుకెళ్లారని తెలిపారు. అప్పటి నుండి పలు లాడ్జిలకు తీసుకు వెళ్లి, ఎవరు లేని ప్రాంతానికి తీసుకు వెళ్లి ఆమె పైన లైంగిక దాడికి దిగారని తెలిపారు. ఐదు రోజుల పాటు ఆమె పైన అత్యాచారం చేశారన్నారు.
అనంతరం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకుముందు బాలిక తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే, ఆ లోగానే బాలిక ఫిబ్రవరి 10వ తేదీన తిరిగి ఇంటికి చేరుకున్నారు. జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications