పెట్లేదు, బండారం బయటపడింది: టిపై సుష్మVsకమల్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (తెలంగాణ ముసాయిదా) బిల్లు పైన కాంగ్రెసు పార్టీ, భారతీయ జనతా పార్టీలు కత్తులు దూసుకుంటున్నాయి. లోకసభలో బిల్లు ప్రవేశ పెట్టామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ చెప్పగా, బిల్లు పెట్టలేదని బిజెపి నేత సుషఅమా స్వరాజ్ అన్నారు.
తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని సుష్మా స్వరాజ్ గురువారం విలేకరులతో అన్నారు. బిల్లును తమకు సప్లిమెంటరీ ఎజెండాగా చూపించారన్నారు. జరుగుతున్న పరిణామాలను అనుకూలంగా మలుచుకునే కుట్రకు కాంగ్రెసు పార్టీ తెరలేపిందన్నారు. కాంగ్రెసు వ్యవహారమంతా డ్రామా అని ధ్వజమెత్తారు.

మీ ముఖ్యమంత్రి, మీరు పంపించిన బిల్లును ఓడించి పంపించారన్నారు. సొంతింటిని చక్కదిద్దుకోకుండా డ్రామాలు ఆడొద్దని హితవు పలికారు. గందరగోళం మధ్య సభలో తెలంగాణ బిల్లును ఎలా ప్రవేశ పెట్టారో తెలియకుండా ఉందన్నారు. ప్రభుత్వం పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టారన్నది అవాస్తవమన్నారు.
కమల్ నాథ్ కౌంటర్
బిల్లును పెట్టలేదనుకుంటే సిసిటివి ఫుటేజ్ చూసుకోవచ్చునని కమల్ నాథ్ అన్నారు. తెలంగాణకు తాము అనుకూలమని ఇన్నాళ్లు చెప్పిన బిజెపి ఇప్పుడు ద్వంద్వవైఖరి అవలంభిస్తోందని మండిపడ్డారు. బిజెపి బండారం బయటపడిందని, ఆ పార్టీ తెలంగాణకు వ్యతిరేకమన్నారు. బిజెపి సహకరించకున్నా బిల్లు ఆమోదం పొందుతుందని చెప్పారు. బిజెపిది రెండు నాల్కల ధోరణి అని ఆరోపించారు.












Click it and Unblock the Notifications