Kamma Mahanadu:30 ఎమ్మెల్యే సీట్లకు తగ్గేదేలా - KGF చీఫ్ జెట్టి కుసుమకుమార్..!!
Kamma Mahanadu : తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. త్వరలో ఆ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని రాజకీయపార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే తమిళనాడులో తెలుగు వారి ఓట్లు కీలకంగా మారనున్నాయి. అందులోను కమ్మ సామాజిక వర్గంకు చెందిన ఓట్లు అధికంగా ఉన్నాయి. అయితే కమ్మ సామాజిక వర్గంకు రాజకీయంగా తగిన ప్రాధాన్యత మాత్రం దక్కడం లేదు. ఈ నేపథ్యంలోనే కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (KGF) అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్ తమ జాతికి రాజకీయంగా ప్రాధాన్యత దక్కాలంటూ నినదించారు. ఈ క్రమంలోనే ఆదివారం రోజున "కమ్మ మహానాడు"పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడి కమ్మసామాజిక వర్గానికి దిశా నిర్దేశం చేశారు.
రాజకీయంగా ఎందుకు వెనుకబడుతున్నాం?
"చేయి చేయి కలిపితే పిడికిలి.. మనం మనం కలిస్తేనే ప్రభంజనం" అంటూ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (KGF) అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం తిరువళ్లూరు జిల్లా శ్రీపెరంబుదూర్ సమీపంలోని సేందమంగళంలో నిర్వహించిన 'కమ్మ మహానాడు' అత్యంత వైభవంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ ప్రతినిధులు ఈ సభకు భారీగా తరలివచ్చారు.సభలో జెట్టి కుసుమకుమార్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశవ్యాప్తంగా 2.10 కోట్ల మంది కమ్మవారు ఉన్నారని, అందులో మూడో వంతు తమిళనాడులోనే ఉన్నారని తెలిపారు.తమిళనాడు జనాభాలో 8 శాతం ఉన్న కమ్మవారికి కేవలం 12 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉండటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.తమిళనాడు అసెంబ్లీలో కనీసం 30 మంది ఎమ్మెల్యేలు, ఒక ఉప ముఖ్యమంత్రి పదవి కమ్మ సామాజికవర్గానికి దక్కాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా, కమ్మ అభ్యర్థులకు KGF పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

చంద్రబాబు అరెస్టు ప్రస్తావన
సామాజికవర్గ భద్రత గురించి మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉదంతాన్ని కుసుమకుమార్ గుర్తు చేశారు. "జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న చంద్రబాబు వంటి నేతనే అక్రమ కేసులతో జైల్లో వేస్తే, సామాన్య కమ్మవారి పరిస్థితి ఏమిటి?" అని ప్రశ్నించారు. అందరం ఐక్యంగా ఉంటేనే ఇలాంటి దాడులను ఎదుర్కోగలమని పిలుపునిచ్చారు.
ప్రముఖుల సందడి - ట్రస్ట్ ఏర్పాటు
ఈ మహానాడులో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ప్రముఖ శతావధాని మేడసాని మోహన్, సీనియర్ నటుడు కె. భాగ్యరాజ్, తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కమ్మవారికి తగిన ప్రాధాన్యత కరువవుతోందని బీఆర్ నాయుడు పేర్కొన్నారు. పేద కమ్మవారిని ఆదుకునేందుకు ఒక గ్లోబల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ ట్రస్ట్ ఏర్పాటుకు జయా ఇంజనీరింగ్ సంస్థల చైర్మన్ కనకరాజ్ రూ. 5 లక్షలు, కొండయ్య రూ. 50 వేల విరాళాన్ని అక్కడికక్కడే ప్రకటించారు.
సామాజిక బాధ్యత.. సమదృష్టి
కమ్మవారు అందరినీ కలుపుకునిపోయే గొప్ప గుణం కలవారని, అయితే అందరూ కమ్మవారి ఆర్థిక బలాన్ని, పత్రికా మద్దతును ఆశిస్తున్నారే తప్ప రాజకీయ గుర్తింపు ఇవ్వడం లేదని సభలో వక్తలు అభిప్రాయపడ్డారు. విద్య, వైద్య రంగాల్లో వెనుకబడిన సామాజికవర్గ సభ్యులకు అండగా నిలవాలని నిర్ణయించారు.
తమిళనాడు వేదికగా జరిగిన ఈ మహానాడు కమ్మ సామాజికవర్గంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాజకీయాధికారం కేవలం ఓటు బ్యాంకుగా మిగిలిపోకుండా, నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలనే KGF లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి. కేవలం ప్రాంతాలకే పరిమితం కాకుండా, గ్లోబల్ స్థాయిలో సంఘటితం కావడం ద్వారానే జాతి అభివృద్ధి సాధ్యమని ఈ సభ ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
జగన్ 2019 నినాదం, పథకాలతో బరిలోకి విజయ్- అక్కడే బిగ్ ట్విస్ట్..!! -
తెరపై స్టార్ హీరో + దర్శకుడు: విజయ్ వద్దనుకున్న చోట.. -
రెండు చోట్ల విజయ్ పోటీ- టీవీకే జాబితా విడుదల: ఒక్క ఛాన్స్ ప్లీజ్ -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications