Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కమ్మవారందరినీ ఒకే తాటిపైకి తేవటమే కేజీఎఫ్ లక్ష్యం - కుసుమ కుమార్..!!

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కమ్మ వారందరినీ ఒకే తాటి పైకి తీసుకురావటమే లక్ష్యంగా పని చేస్తున్నా మని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జెట్టి కుసుమ కుమార్ వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక కమ్మ సంఘాలు ఉన్నాయని.. వారందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకు రావలనే సంకల్పంతో ఈ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. తమిళనాడులోని ఉన్న దాదాపు పది లక్షల మంది కమ్మ వారితో కమ్మ మహానాడు నిర్వహించనున్నట్లు కుసుమ కుమార్ వెల్లడించారు. ఇందుకు సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

తమిళనాడులోని కమ్మ వారిందరినీ ఒకే తాటి మీదకు తీసుకొచ్చేందుకు తమిళనాడులో కేజీఎఫ్ కమ్మ మహానాడు నిర్వహించాలని నిర్ణయించినట్లు కేజీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు జెట్టి కుసుమ కుమార్ వెల్లడించారు. కమ్మవారు వ్యాపారస్తులుగా గానే కాకుండా సినిమా రంగంలోనూ పారిశ్రామిక రంగంలోనూ రాణిస్తూ సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నట్లు వివరించారు. వ్యవస్థను శాసించా లంటే రాజ్యాధికారం ఉండాలని పేర్కొన్నారు. అందులో భాగంగా కమ్మజాతి రాజ్యాధికారం ఉండే లా గ్రామస్థాయి నుంచి కమ్మ యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేలా కార్యాచరణ ఉంటుందని చెప్పారు. అన్ని పార్టీలలో కమ్మవారి ఎదగాలన్న ఉన్నత లక్ష్యంతో కేజిఎఫ్ పనిచేస్తుందని ప్రకటించారు. రాబోయే డిసెంబర్, జనవరిలో 10 లక్షల మందితో కేజిఎఫ్ మెగా సమ్మిట్ ను తమిళ కమ్మ మహానాడుగా జరపుతామని వెల్లడించారు.

a-call-for-unity-jetti-kusumakumar-on-consolidating-the-kamma-community-says-public-meeting-with

దీనికోసం సన్నాహక సమావేశాలను జూన్ 1వ తేదీ ఆదివారం చెన్నై లోని పూందమల్లి హై రోడ్డు, అమింజ్ కరైలో ఉన్న అయ్యావో మహల్ వేదికగా నిర్వహిస్తున్నట్టు వివరించారు. అదే విధంగా జూన్ 15వ తేదీన మధురై లోనూ, జూన్ 22వ తేదీన కోయంబత్తూరులోనూ సన్నాహక సమావేశా లు నిర్వహిస్తున్నామని కుసుమ కుమార్ చెప్పుకొచ్చారు. ఈ సన్నాహక సమావేశంలో తమిళనాడు రాష్ట్రంలో ఉన్న కమ్మ సంఘాల నాయకులు అందరూ పాల్గొని ఈ కమ్మ మహానాడు ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో కేజీఎఫ్-తమిళనాడు ప్రముఖులు రంగభాష్యం, ముండ్రు శ్రీనివాస్ రావు, ప్రతాప్ నాయుడు, రామన్ నాయుడు, డి.నరేంద్రన్ నాయుడు, నేతాజీ నాయుడు, డి.పురుషోత్తం నాయుడు, టి.సురేష్ తదితరులు పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+