కేంద్ర మంత్రితో ప్రేమాయణం? కంగనా రనౌత్ క్లారిటీ!
బాలీవుడ్ స్టార్ నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ తనపై వస్తున్న ప్రేమ పుకార్లకు తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టారు. తోటి రాజకీయ నాయకుడు చిరాగ్ పాశ్వాన్‌తో కంగన ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా బహిరంగ వేదికలపై వీరిద్దరూ కలిసి కనిపిస్తుండటంతో అభిమానులు వీరి మధ్య ఏదో ఉందంటూ ఊహాగానాలు మొదలుపెట్టారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో కంగనా ఈ వార్తలను పూర్తిగా కొట్టిపారేశారు.
ఈ పాటికి పిల్లలు ఉండేవారు: కంగనా రనౌత్
చిరాగ్ పాశ్వాన్‌తో తనకున్న అనుబంధం గురించి కంగనా స్పందిస్తూ.. ఆయన తనకు కేవలం ఒక మంచి స్నేహితుడు మాత్రమేనని స్పష్టం చేశారు. "మా మధ్య ఎలాంటి రొమాన్స్ లేదు, నిజాయితీగా చెప్పాలంటే చిరాగ్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. దాదాపు పదేళ్ల క్రితమే ఆయన నాతో కలిసి ఒక సినిమా చేశారు. ఒకవేళ మా మధ్య నిజంగానే ప్రేమ ఉండి ఉంటే.. ఈపాటికి మాకు పిల్లలు కూడా ఉండేవారు" అంటూ కంగనా రనౌత్ తనదైన శైలిలో సెటైరికల్ కామెంట్స్ చేశారు. తామిద్దరం సినిమా నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లం కావడం వల్ల ఒకరి పట్ల ఒకరికి గౌరవం, స్నేహపూర్వక వాతావరణం ఉంటుందని ఆమె వివరించారు.

అందుకే ఈ పుకార్లు
కంగనా రనౌత్, చిరాగ్ పాశ్వాన్ ఇద్దరూ కలిసి 2011లో 'మిలే నా మిలే హమ్' అనే రొమాంటిక్ డ్రామాలో నటించారు. తన్వీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే చిరాగ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత కాలంలో వీరిద్దరూ సినిమాలను పక్కన పెట్టి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రస్తుతం కంగనా మండీ నుంచి ఎంపీగా గెలవగా.. చిరాగ్ పాశ్వాన్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాజకీయ వేదికలపై వీరిద్దరూ పక్కపక్కన కూర్చున్న ఫోటోలు వైరల్ కావడంతో ఈ రూమర్లు పుట్టుకొచ్చాయి.
ఆ రూమర్లపై క్లారిటీ
ఇక కంగనా ప్రొఫెషనల్ లైఫ్ విషయానికి వస్తే.. ఆమె ఇటీవల 'ఎమర్జెన్సీ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు ఆమె దర్శకత్వం వహించడమే కాకుండా, మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉంటూనే తన సినిమా కెరీర్‌ను కూడా ఆమె కొనసాగిస్తున్నారు. తాజాగా ఆమె చేసిన ఈ ప్రకటనతో చిరాగ్ పాశ్వాన్‌తో ముడిపెడుతూ వస్తున్న వార్తలకు తెరపడినట్లయింది.












Click it and Unblock the Notifications