ఆకాశంలో నిద్రించండి! ప్రపంచంలోనే తొలిసారిగా విమానాల్లో స్లీపింగ్ పాడ్స్!

సుదీర్ఘ ప్రయాణాలు చేసే విమాన ప్రయాణికులకు సాధారణంగా ఎదురయ్యే అతిపెద్ద సమస్య 'నిద్ర'. ముఖ్యంగా ఎకానమీ క్లాస్‌లో గంటల తరబడి కూర్చుని ప్రయాణించడం నరకప్రాయంగా ఉంటుంది. ఈ ఇబ్బందులను తొలగిస్తూ.. ఎయిర్ న్యూజిలాండ్ విమానయాన సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఎకానమీ ప్రయాణికుల కోసం 'స్కైనెస్ట్'పేరుతో స్లీపింగ్ పాడ్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల సామాన్య ప్రయాణికులు కూడా విమానంలో పడక సౌకర్యాన్ని పొందే అవకాశం లభిస్తుంది.

స్కైనెస్ట్ అంటే ఏమిటి? ఎలా ఉంటుంది?
స్కైనెస్ట్ అనేది విమానం లోపల ఎకానమీ, ప్రీమియం ఎకానమీ క్యాబిన్‌ల మధ్య ఏర్పాటు చేసిన ఆరు పడక సముదాయం. వీటిని ఒకదానిపై ఒకటి బంక్ బెడ్ల తరహాలో అమర్చారు. సుదీర్ఘ ప్రయాణాలు చేసే బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ విమానాల్లో ఈ సదుపాయం ఉంటుంది. ప్రతి పాడ్‌లో మెత్తటి పరుపు, బెడ్డింగ్, ప్రశాంతమైన లైటింగ్, వ్యక్తిగత వెంటిలేషన్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఛార్జ్ చేసుకునేందుకు వీలుగా ఛార్జింగ్ పోర్ట్స్ వంటి అత్యాధునిక వసతులు ఉంటాయి. దాదాపు 200 మంది వినియోగదారులపై పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఈ డిజైన్‌ను ఖరారు చేశారు.

Air New Zealand Skynest World First Economy Bunk Beds for Long-Haul Flights Explained Full Details

బుకింగ్ వివరాలు, ధర
ఈ వినూత్న సదుపాయం కోసం మే 18, 2026 నుంచి బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సేవలు నవంబర్ 2026 నుంచి అందుబాటులోకి వస్తాయి. ఎకానమీ లేదా ప్రీమియం ఎకానమీ టికెట్ కలిగిన ప్రయాణికులు అదనపు రుసుము చెల్లించి ఈ సేవలను 'యాడ్-ఆన్'గా బుక్ చేసుకోవచ్చు. ఒక్కో ప్రయాణికుడికి 4 గంటల పాటు ఈ బెడ్‌పై పడుకునే అవకాశం ఉంటుంది. సహజమైన నిద్ర చక్రాలకు ఇబ్బంది కలగకుండా ఈ 4 గంటల సమయాన్ని నిర్ణయించారు. ఒక్కో సెషన్‌కు ధర సుమారు 495 న్యూజిలాండ్ డాలర్లు (సుమారు రూ.25,000) నుంచి ప్రారంభం కావచ్చు.

పర్యాటక రంగానికి ఊతం
న్యూజిలాండ్ భౌగోళికంగా ప్రపంచంలోని ఇతర దేశాలకు చాలా దూరంగా ఉంటుంది. ఇక్కడికి రావాలన్నా లేదా ఇక్కడి నుంచి వెళ్లాలన్నా ప్రయాణికులు సుమారు 15 నుంచి 18 గంటల పాటు విమానంలో గడపాల్సి ఉంటుంది. "ఎంత దూరమైనా ప్రయాణం సుఖవంతంగా ఉంటేనే పర్యాటకులు రావడానికి ఇష్టపడతారు" అని ఎయిర్ న్యూజిలాండ్ సీఈఓ నిఖిల్ రవిశంకర్ పేర్కొన్నారు. న్యూజిలాండ్ పర్యాటక రంగం విలువ సుమారు 46 బిలియన్ డాలర్లు. ఈ స్కైనెస్ట్ వంటి ఆవిష్కరణలు పర్యాటకుల ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడమే కాకుండా, దేశ ఆర్థిక వృద్ధికి కూడా తోడ్పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+