నియోజకవర్గాల పెంపు వేళ చంద్రబాబు అనూహ్య నిర్ణయం..!!

ఇప్పుడు దేశ వ్యాప్తంగా నియోజకవర్గాల పెంపు పైన చర్చ సాగుతోంది. పార్లమెంట్ లో కేంద్రం ఈ మేరకు మహిళా రిజర్వేషన్ తో పాటుగా డీలిమిటేషన్ బిల్లు ప్రతిపాదించింది. విపక్షాలు మహిళా బిల్లుకు మద్దతు ఇస్తూ డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తున్నాయి. ఏపీలోని అన్ని పార్టీలు కేంద్రం తాజా ప్రతిపాదనలకు ఆమోదం తెలిపాయి. ఈ బిల్లు ఆమోదం పొందితే ఏపీలోనూ లోక్ సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం మేర పెరగనున్నాయి. ఈ సమయంలోనే సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ లో మహిళా బిల్లు.. అదే సమయంలో డీలిమిటేషన్ బిల్లు పైన మంత్రాంగం సాగిస్తున్నారు. కూటమి భాగస్వామ్య పక్ష నేతలతో చంద్రబాబు చర్చించారు. పవన్ తో పాటుగా బీజేపీ మాధవ్ తో చంద్రబాబు చర్చల సమయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే చర్చ పై కేంద్ర మంత్రుల నుంచి స్పష్టత తీసుకున్నారు.

CM Chandra Babu decided for crucial meeting with MLA s amid delimitation bill introduced in parliament

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజుజు, కేంద్ర న్యాయ శాఖమంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌లతో ఫోన్‌లో మాట్లాడారు. లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచుతున్నట్లుగా బిల్లులో పొందుపరచకపోవడంతో నెలకొన్న సందిగ్ధత గురించి ప్రశ్నించారు. దీంతో... అన్ని వివరాలను బిల్లులో పొందుపరచలేమని, అన్ని రాష్ట్రాల్లో పార్లమెంటు సీట్లు 50 శాతం పెరుగుతాయని ఇద్దరు కేంద్ర మంత్రులు స్పష్టం చేసినట్లు తెలిసింది.

సభలో చర్చ సందర్భంగా ఈ విషయాన్ని పార్లమెంటు వేదికగానే ప్రభుత్వం ప్రకటిస్తుందని పేర్కొన్నట్లు సమాచారం. అటు మహిళా బిల్లు ఆమోదం వేళ ఏపీకి చెందిన కూటమి మహిళా నేతలు ఢిల్లీకి చేరారు. స్వయంగా మహిళా బిల్లు ఆమోదం వీక్షించాలని.. తరువాత ఏపీ వ్యాప్తంగా మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో చంద్రబాబు మరో నిర్ణయం తీసుకున్నారు. రేపు (శుక్రవారం) మంత్రులు.. ఎమ్మెల్యే లతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం ఏర్పాటు చేసారు.

మహిళా రిజర్వేషన్ తో పాటుగా డీ లిమిటేషన్ అంశం పై కూడా చర్చించనున్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ లో ఈ సమావేశం ఏర్పాటు చేసారు. త్వరలో పెరిగే అసెంబ్లీ నియోజకవర్గాల వేళ.. కేంద్రం నియమించే డీ లిమిటేషన్ కమిటీ.. రాష్ట్రంలో అమలు కానున్న రిజర్వేషన్లు.. మహిళలకు సీట్లు.. కూటమిగా ఈ వ్యవహారంలో ఎలా ముందుకు వెళ్లాలనేది చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+