కంగనా రనౌత్ బాడీగార్డుపై రేప్ కేసు.. పెళ్లి పేరుతో శారీరకంగా లోబర్చుకుని.. మోసపోయిన మేకప్ ఆర్టిస్ట్...
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ బాడీగార్డుపై ముంబై పోలీసులు అత్యాచార కేసు నమోదు చేశారు. ప్రేమ,పెళ్లి పేరుతో తనను శారీరకంగా లోబర్చుకుని మోసం చేశాడని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే నిందితుడు కంగనా రనౌత్ బాడీ గార్డా కాదా అనే విషయం తమకు తెలియదని పోలీసులు వెల్లడించారు.బాలీవుడ్ మీడియా మాత్రం నిందితుడు కంగనా రనౌత్ బాడీగార్డుగా పేర్కొంది.

బాధితురాలు మేకప్ ఆర్టిస్ట్...
బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం... కంగనా రనౌత్ బాడీ గార్డు కుమార్ హెగ్దేపై ముంబైలోని డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 376,377,420ల కింద కేసు నమోదైంది. మేకప్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎనిమిదేళ్లుగా కుమార్ హెగ్దేతో తనకు పరిచయం ఉందని... ప్రేమ,పెళ్లి పేరుతో అతను తనను లోబర్చుకున్నాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

పెళ్లి ప్రపోజల్.. శారీరక సంబంధం...
గత ఏడాది జూన్‌లో హెగ్దే పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చాడని... అందుకు తాను అంగీకరించానని బాధితురాలు తెలిపారు. అప్పటినుంచి తరచుగా తన ఫ్లాట్‌కి రావడం మొదలుపెట్టిన హెగ్దే బలవంతంగా తనను శారీరకంగా లోబర్చుకున్నాడని ఆరోపించారు. ఏప్రిల్ 27న రూ.50 వేలు తీసుకుని తన ఫ్లాట్ నుంచి అతను పారిపోయినట్లు చెప్పారు. ఆ తర్వాత కర్ణాటకలోని తన స్వగ్రామానికి వెళ్లిపోయిన అతను వేరే యువతిని పెళ్లి చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిపారు.

కులాలు వేరని చెప్పి...
ఇదే క్రమంలో ఓరోజు హెగ్దే తల్లి తనకు ఫోన్ చేసి బెదిరించిందని ఆరోపించారు. తన కొడుక్కి వేరే పెళ్లి చేస్తున్నామని... కులాలు వేరైనందునా నీతో పెళ్లి చేసే ప్రసక్తే లేదని ఆమె చెప్పినట్లు పేర్కొన్నారు. తన ఫ్లాట్ నుంచి వెళ్లిపోయిన తర్వాత హెగ్దే మళ్లీ తనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదని అన్నారు. తాను ఎన్నిసార్లు అతనితో మాట్లాడే ప్రయత్నం చేసినా అటువైపు నుంచి స్పందన రాలేదన్నారు.
దీంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పారు. పోలీసులు అతనిపై అత్యాచార కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో కంగనా వద్ద పనిచేసిన హెయిర్ స్టైలిస్ట్ అలిస్టర్‌పై కూడా అత్యాచార ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. 2020లో మైనర్ బాలికపై అత్యాచార కేసులో పోక్సో చట్టం కింద పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications