అనుమానాస్పద స్థితిలో ఐఐటి కాన్పూర్ విద్యార్థి మృతి

అతను మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాడని, దాని నుంచి బయటపడడానికి సహాయం కూడా తీసుకుంటున్నాడని వారు చెబుతున్నారు. ఐఐటి కాన్పూర్‌లో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించడం ఈ ఏడాది ఇది రెండో సంఘటన.
ఈ ఏడాది జనవరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బిటెక్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి శవం రైల్వే ట్రాక్స్‌పై పడి కనిపించింది. మంజునాథ్ కంప్యూటర్ సైన్స్ చదవుతున్నాడు. పోలియో కారణంగా తన కాళ్లను వాడలేకపోతున్నాడు. అతను కర్ణాటకలోని రాయచూర్ జిల్లాకు చెందినవాడు.
బాల్యంలోనే ఆ విద్యార్థి తండ్రిని కోల్పోయాడని, కొద్ది నెలల క్రితం అతని సోదరి కూడా మరణించిందని ఐఐటి కాన్పూర్ రిజిస్ట్రార్ ఆర్‌కె సచాన్ చెప్పారు. మంజునాథ్ గదిలో విషపదార్థం కనిపించిందని, విషం తీసుకోవడం వల్ల మరణించి ఉంటాడని పోస్టుమార్టం నివేదిక కూడా తెలియజేస్తోందని ఆయన అన్నారు.
మంజునాథ్ మృతి గురించి అతని తల్లికి సమాచారం అందించామని ఆయన అన్నారు. మృతిగల కారణాలను తెలుసుకోవడానికి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications