కావేరి రచ్చ: సిద్దు చలో ఢిల్లీ: బెంగళూరులో హై అలర్ట్
బెంగళూరు: కావేరీ జలాల పంపిణి విషయంలో తమిళనాడుకు నీళ్లు వదలరాదని కఠిన నిర్ణయం తీసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గురువారం ఆగమేఘాల మీద ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇక్కడి హెచ్ఏఎల్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన గురువారం మద్యాహ్నం ఢిల్లీ వెళ్లారు.
గురువారం ఉదయం సీఎం సిద్దరామయ్య గవర్నర్ వాజూ బాయ్ వాలను కలుసుకున్నారు. ఈనెల 23వ తేదిన ప్రత్యేక ఉబయ సభల సమావేశాలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని మనవి చేశారు.
ఇదే సందర్బంలో కావేరీ జలాల పంపిణి విషయంలో బెంగళూరు నగరం, మండ్య, మైసూరు, చామరాజనగర తదితర జిల్లాల్లో జరుగుతున్న ఆందోళనల విషయంపై సీఎం సిద్దరామయ్య గవర్నర్ కు క్షుణ్ణంగా వివరించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం సిద్దరామయ్య 23వ తేదిన ఉబయ సభల సమావేశాలు జరుగుతాయని వివరించారు. అనంతరంత సీఎం సిద్దరామయ్య తన సీనియర్ మంత్రి వర్గ సహచరులతో చర్చించి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
ఉమాభారతీ అపాయింట్ మెంట్
కేంద్ర జనవనరుల శాఖా మంత్రి ఉమాభారతీతో చర్చించడానికి అపాయింట్ మెంట్ ఇవ్వాలని సిద్దరామయ్య ఆ శాఖ అధికారులకు మనవి చేశారు. గురువారం సాయంత్రం ఉమాభారతీని కలవడానికి అవకాశం ఉంటుందని సమాచారం.

బెంగళూరులో హై అలర్ట్.... మద్యం దుకాణాలు బంద్
కావేరీ జలాల పంపిణి నిలిపివేయడంతో బెంగళూరు నగరంలో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. సెప్టెంబర్ 22వ తేది రాత్రి నుంచి 25వ తేది రాత్రి వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ మేఘరిక్ ఆదేశాలు జారీ చేశారు.
తమిళులు ఉన్న ప్రాంతాల్లో సాయుధ బలగాలు
బెంగళూరు నగరంలో తమిళ ప్రజలు నివాసం ఉంటున్న అన్ని ప్రాంతాల్లో సాయుధ బలగాలు మొహరించాయి. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరకుండా పోలీసు అధికారులు గట్టి చర్యలు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications