సీఎం సిద్దరామయ్య సంచలన నిర్ణయం, బెంగళూరు ఉద్యోగులు, ప్రజలు ఫుల్ హ్యాపీ !

బెంగళూరు: డీకే శివకుమార్ తో ఢీకొట్టి ఎట్టకేలకు కర్ణాటక ముఖ్యమంత్రి అయిన సిద్దరామయ్య సంచలన నిర్ణయాలు తీసుకోవడంతో బెంగళూరు ప్రజలు ఫుల్ హ్యాపీ అయ్యారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత సిద్దరామయ్యను అభినందించడానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న నాయకులు సీఎంను సన్మానించడానికి పోటీ పడుతున్నారు.

గజ మాలలు, శాలువలు, బహుమతులు తీసుకుని సీఎం సిద్దరామయ్యను సన్మానించడానికి ఆయన ఇంటికి క్యూకడుతున్నారు. ఇక బహిరంగ సభలు, సమావేశాలు, పలు కార్యక్రమాలకు సీఎం సిద్దరామయ్య హాజరు అయితే ఆయన్ను ఘనంగా సన్మించి ఆయన దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని, రాజకీయంగా లబ్దిపొందాలని నాయకులు ప్లాన్ చేస్తున్నారు.

 siddaramaiah

ఇలాంటి సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ముందు తనకు పూలమాలలు వేసి శాలవులతో సత్కరించడానికి ప్రయత్నించకూడాదని, అయితే మీ అభిమానం, ప్రేమానురాగాలు తనకు నిత్యం అండగా ఉండాలని అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మనవి చేశారు.

తనను అభినందించాలని అనుకున్న అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తులు పూల మాలలు, శాలవాలకు బదులుగా ఏవైనా పుస్తకాలు అందివ్వాలని సీఎం సిద్దరామయ్య మనవి చేశారు. అనవసరంగా డబ్బులు ఖర్చు చెయ్యడం తనకు ఇష్టం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అంటున్నారు.

 siddaramaiah

బహిరంగ సభలకు తాను హాజరైన సమయంలో కూడా గజమాలలు, శాలవులాతో తనకు సన్మానం చెయ్యకూడదని, అక్కడ కూడా తనకు పుస్తకాలు బహుమతిగా ఇచ్చి అభిమానం చాటుకుంటే చాలని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ట్వీట్ చేశారు. సీఎం సిద్దరామయ్య తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు సామాన్య ప్రజలు కూడా అభినందిస్తున్నారు. సీఎం సిద్దరామయ్య హంగామాలకు దూరంగా ఉండాలని నిర్ణయించడం చాలా గ్రేట్ అని కన్నడిగులు అంటున్నారు.

జీరో ట్రాఫిక్ సదుపాయం వద్దు అని చెప్పిన సీఎం:

సీఎం సిద్దరామయ్య ఆయన బెంగళూరులో సంచరించడానికి పోలీసు అధికారులు జీరో ట్రాఫిక్ సౌలభ్యం అందుబాటులోకి తీసుకువచ్చారు. మామూలుగా సీఎంలు సంచరించడానికి బెంగళూరులో జీరో ట్రాఫిక్ అమలు చేస్తున్నారు. అయితే తనకు జీరో ట్రాఫిక్ సదుపాయం వద్దు అని సీఎం సిద్దరామయ్య అంటున్నారు.

 siddaramaiah

బెంగళూరులో ట్రాఫిక్ తో నిత్యం ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పుడున్న ట్రాఫిక్ సమస్యలకు తోడు తాను జీరో ట్రాఫిక్ లో తిరిగితే ప్రజలకు ఇంకా సమస్యలు ఎదురౌతని, అలా కాకుండా మామూలుగానే తాను సంచరిస్తానని బెంగళూరు నగర పోలీసు కమీషనర్ ప్రతాప్ రెడ్డికి సీఎం సిద్దరామయ్య లేఖ రాశారు. బెంగళూరులో నిత్యం ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు, ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులు సీఎం సిద్దరామయ్య నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+