సీఎం అయిన గంటల్లోనే ఐపీఎస్ అధికారులను బదిలి చేసిన యడ్యూరప్ప, ఇంటెలిజెన్స్!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్. యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలు మొదలైనాయి. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే అధికారులను ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప బదిలీ చేస్తున్నారని సమాచారం.
Recommended Video

కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప
బీదర్ జిల్లా ఎస్పీ దేవరాజ్ ను బెంగళూరు నగర సెంట్రల్ డీసీపీగా బదిలీ చేశారు. అమర్ కుమార్ పాండేని ఇంటెలిజెన్స్ ఏడీజీపీగా, సందీప్ పాటిల్ ను ఇంటెలిజెన్స్ డీఐజీగా బదిలీ చేశారు. బెంగళూరు ఈశాన్య విభాగం డీసీపీగా ఎస్. గిరీష్ ను బదిలీ చేశారు.

కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత బీఎస్ యడ్యూరప్ప మొదట రైతుల రుణమాఫి పై అధికారులతో చర్చించారు. రైతుల రుణమాఫీ విషయం చర్చలు పూర్తి అయిన తరువాత ఐపీఎస్ అధికారుల బదిలీలపై బీఎస్. యడ్యూరప్ప దృష్టిసారించారు.












Click it and Unblock the Notifications