సీఎం, హోమ్ మంత్రి రహస్య చర్చలు, ఏం జరుగుతోందని మంత్రుల్లో టెన్షన్ !
బెంగళూరు/బళ్లారి: కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 135 సీట్లతో ఊహించని విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ శిబిరంలో అసంతృప్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో పాటు సిద్దరామయ్య ప్రభుత్వంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న విమర్శలు, ప్రకటనలు తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పటికే మంత్రి పదవులు రాని సీనియర్ నేతలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికే పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేల్లో అనేక అంతర్గత కలహాలు చెలరేగడంతో పాటు పలువురు ఎమ్మెల్యేలు సీఎల్ పీ సమావేశంలో కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయినప్పటికీ శాసనసభ సమావేశం ముగిసిన తర్వాత, కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన 25 మంది నేతలను ఆగస్టు 2న ఢిల్లీకి రావాలని ఆదేశాలు జారీ చేసింది.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆ రాష్ట్ర హోమ్ మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ అజ్ఞాత ప్రదేశంలో రహస్య సమావేశం నిర్వహించడం పలు అనుమానాలకు దారి తీసింది. కర్ణాటక రాష్ట్ర హోమ్ శాఖలో పెండింగ్‌లో ఉన్న బదిలీలు, బదిలీల ప్రక్రియపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో సీఎం సిద్ధరామయ్య, హోమ్ మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్‌లు ఆదివారం గుర్తుతెలియని ప్రదేశంలో పలు అంశాలపై చర్చలు జరిపినట్లు విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి.
కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో 30 మందికి పైగా ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారని కన్నడ మీడియా అంటోంది. పోలీసు అధికారుల బదిలీల్లో జాప్యంపై ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో వేధించిన అధికారుల బదిలీకి కూడా సిఫారసు చేయలేదని, వారిని ఇంకా ఆ పదవుల్లోనే కొనసాగిస్తున్నారని కొందరు ఎమ్మెల్యేలు మండిపడుతున్నారని తెలిసింది.

కొందరు నేతలు తమతో కలిసి వాళ్లు ఎలా పని చేస్తారని అసహనం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోమ్ మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ రహస్యంగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలాంటి సమయంలో గుర్తు తెలియని ప్రదేశంలో సిద్ధరామయ్యను డాక్టర్ జీ.పరమేశ్వర్ కలవకముందే. డాక్టర్ జీ.పరమేశ్వర్, రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్ మోహన్, హోమ్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఆదివారం ముఖ్యమంత్రి సిద్దరామయ్య నివాసానికి చేరుకుని చర్చలు జరిపారు.

అనంతరం సిద్ధరామయ్యతో పోలీసుల అధికారుల బదిలీ జాబితాపై చర్చించినట్లు సమాచారం. మొత్తానికి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు మాత్రమే గడిచినా ప్రభుత్వాన్ని, పార్టీని సామరస్యపూర్వకంగా నడిపించే విషయంలో చాలా గ్యాప్‌లు ఏర్పడ్డ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య, హోమ్ మంత్రి, పరమేశ్వర్‌ల భేటీ కాస్త ఆసక్తికరంగానే మారింది. గతంలో డాక్టర్ జీ. పరమేశ్వర్ కూడా సీఎం రేసులో, డీసీఎం రేసులో ఉన్న విషయం తెలిసిందే.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications