సీఎం సీటు కోసం సిద్దరామయ్య వెయ్యి కోట్లు ముట్టజెప్పారు: యెడ్యూరప్ప
సీఎం పదవి కోసం కాంగ్రెస్ హైకమాండ్ కు సిద్దరామయ్య వెయ్యి కోట్ల రూపాయల ముడుపులు ముట్టజెప్పారని మాజీ సీఎం యడ్యూరప్ప ఆరోపించారు.
బెంగుళూరు: కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై మాజీ సీఎం యడ్యూరప్ప తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం పదవి కోసం కాంగ్రెస్ పెద్దలను ప్రసన్నం చేసుకున్న సిద్దరామయ్య వారికి వెయ్యి కోట్ల దాకా ముట్టజెప్పారని ఆరోపించారు.
సిద్దరామయ్య ప్రధాన అనుచరుడు ఎమ్మెల్సీ గోవిందరాజు ద్వారా గతేడాది మార్చిలో ఈ డబ్బంతా కాంగ్రెస్ హైకమాండ్ కు చేరిందన్నారు. దీనికి సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ఇక సీఎం సిద్దరామయ్యను విమర్శిస్తూ పదవిని కాపాడుకోవడం కోసం ఆయన చేయని పని అంటూ లేదన్నారు.

సిద్దరామయ్య వ్యవహారాలకు సంబంధించిన విషయాలన్ని త్వరలో వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. కాగా, సిద్దరామయ్య మీద ముడుపుల ఆరోపణలు చేసిన యడ్యూరప్ప.. ఆ ముడుపులు ఎవరెవరికి ముట్టజెప్పారనేది మాత్రం వివరించలేదు. దీనిపై మీడియా ఆయన్ను ప్రశ్నించగా సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.












Click it and Unblock the Notifications