బీజేపీకి ఊహించని ఝలక్ ఇచ్చిన సిద్దూ, బోమ్మయ్ ప్రభుత్వంలోని కాంట్రాక్ట్ లు ?
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చారు. గత ఆరు నెలల క్రితం నుంచి అప్పటి బీజేపీ ప్రభుత్వం కేటాయించిన కాంట్రాక్టు పనులు మొత్తం నిలిపివేయాలని,, ఎవ్వరికి ఎలాంటి బిల్లులు చెల్లించకూడదని, ఏ పద్దతితో కాంట్రాక్టు పనులు అప్పగించారో పూర్తి సమాచారం తనకు ఇవ్వాలని సీఎం సిద్దరామయ్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
గత ఆరు నెలల క్రితం అప్పటి బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వం వివిద శాఖలు, బోర్డులు, కార్పోరేషన్లకు సంబంధించి కేటాయించిన కాంట్రాక్టు పనులు ఇచ్చిందని, బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వం కేటాయించిన రూ. 1 కోటి కంటే ఎక్కువ విలువైన అన్ని కాంట్రాక్టు పనులు వెంటనే నిలిపివేయాలని, సంబంధిత కాంట్రాక్టు పనుల వివరాలు మొత్తం తన కార్యాలయానికి పంపించాలని సీఎం సిద్దరామయ్య కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.

అంతే కాకుండా కాంట్రాక్టు పనులు అప్పగించిన తేదీలు, మొదట కాంట్రాక్టు పనులు ఎంత మొత్తానికి ఇచ్చారు. తరువాత ఆ టెండర్ల డబ్బు ఎంతకు పెంచారు, కాంట్రాక్టర్లకు ముందుగా ఎంత డబ్బులు విడుదల చేశారు. పనులు ఎలా జరుగుతున్నాయి అనే పూర్తి సమాచారం తనకు ఇవ్వాలని సీఎం సిద్దరామయ్య ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.
గ్రామీణాభివృద్ది శాఖ, పంచాయితీ రాజ్ శాఖ పరిధిలోని పలు గ్రామాల్లో తాగునీటి కోసం చాలా టెండర్లు పిలిచారని, అలాగే నీటిపారుదల శాఖ పరిధిలోని విశ్వేశ్వరయ్య జల మండలి, కర్ణాటక నీటిపారుదల శాఖ, కావేరి నీటి సరఫరా, కృష్ణ భాగ్య నీటి మండలి పరిధిలో ఇప్పటికే కోట్ల రూపాయల విలువైన పనులు అప్పగించారని, ఆ పూర్తి వివరాలు తనకు ఇవ్వాలని సీఎం సిద్దరామయ్య సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

కల్యాణ కర్ణాటక ప్రాంతంలో అభివృద్ది (కేకేఆర్ డీబీ) కోసం 2022-23 సంవత్సరంలో రూ. 3, 000 కోట్లు నిధులు మంజూరు అయ్యాయి. గత సంవత్సరం ఆ నిధులు మరో రూ. 785 కోట్లు పెంచడంతో మొత్తం నిధులు రూ. 3, 785 కోట్లు అయ్యాయి. సంబంధిత కాంట్రాక్టర్లకు ముందుగా 40 శాతం నిధులు అంటే రూ. 600 కోట్లు విడుదల చేశారని సిద్దరామయ్య ప్రభుత్వం అంటోంది.
ఆ పనుల్లో రూ. 1 కోటి కంటే ఎక్కువ విలువైన కాంట్రాక్టు పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు వెంటనే పనులు నిలిపి వెయ్యాలని ఆదేశాలు జారీ చెయ్యాలని సీఎం సిద్దరామయ్య సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమీషన్ ప్రభుత్వం అని ఆరోపిస్తూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే కాంట్రాక్టుట పనులకు బ్రేక్ వెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications