
కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి నిజమే, ఉప ముఖ్యమంత్రి, మంత్రి పదవులు, హైకమాండ్!
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత జరిగిన మంత్రి వర్గ విస్తరణ తరువాత ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే అని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ మాజీ అధక్ష్యుడు డాక్టర్ జి. పరమేశ్వర్ బెంగళూరులో మీడియాకు చెప్పారు.

ఎమ్మెల్యేల సమావేశం
సోమవారం కాంగ్రెపార్టీ శాసన సభ్యుల సమావేశం ఏర్పాటు చేశామని, శాసన సభ్యులు అందరికీ ఆహ్వాహనం పంపించామని కర్ణాటక ముఖ్యమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర్ అన్నారు. ఎమ్మెల్యేల సమావేశంలో పలుఅంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని డాక్టర్ జి. పరమేశ్వర్ అన్నారు.

సిద్దూ ప్రభుత్వం
గత సిద్దరామయ్య ప్రభుత్వంలో నియోజక వర్గాలకు ఎంత నిధులు మంజూరు అయ్యాయి, అభివృద్ది పనులు ఎంతవరకూ పూర్తి అయ్యాయి. ఇంకా నిధులు ఏమైనా మంజూరు చెయ్యవలసి ఉందా అని వివరాలు సేకరిస్తామని డాక్టర్ జి. పరమేశ్వర్ మీడియాకు చెప్పారు.

ఎమ్మెల్యేల అసంతృప్తి
కర్ణాటకలోని కాంగ్రెస్ -జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో కొందరికి మంత్రి పదవుల పంపకం విషయంలో అసంతృప్తితో ఉన్నారని, వారితో చర్చించి సమస్యలు పరిష్కారం కావడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని డాక్టర్ జి. పరమేశ్వర్ మీడియాకు చెప్పారు.

ఎంత మంది డుమ్మా !
జూన్ 6వ తేదీ జరిగిన కర్ణాటక మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవులు దక్కకపోవడంతో మాజీ మంత్రులు ఎంబి. పాటిల్, సతీష్ జారకిహోళి తదితరులు అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంలో ఉప ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంతమంది ఎమ్మెలేలు హాజరు అవుతారో వేచిచూడాలి.