బెంగళూరులో ఈవీలు నడిపే వారికి బిగ్ షాక్

ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈవీలపై ఉన్న 100 శాతం రోడ్డు పన్ను మినహాయింపును రద్దు చేసింది. ఈ మేరకు కర్ణాటక మోటారు వాహన పన్ను చట్టం 2026ను ప్రకటించింది. దీన్ని నోటిఫై చేసింది. దీంతో బ్యాటరీతో నడిచే కార్లు, జీపులు, బస్సులు, ప్రైవేట్ సర్వీస్ వాహనాలకు ఇకపై పన్ను తప్పదు. సాధారణ వాహనాల తరహాలోనే వాటి కొనుగోలుదారులు కూడా రోడ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది.

రిజిస్ట్రేషన్ సమయంలో వాహనం ధర ఆధారంగా లైఫ్ ట్యాక్స్ విధిస్తారు. 10 లక్షల రూపాయల వరకు ధర ఉండే ఈవీలకు అయిదు శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ. 10 లక్షల నుండి రూ. 25 లక్షల మధ్య ధర ఉంటే 8, రూ. 25 లక్షలు, ఆపై ధర కలిగిన ఈవీలకు 10 శాతం పన్ను వర్తిస్తుంది. ఎలక్ట్రిక్ టూవీలర్లకు మాత్రం ఈ ట్యాక్స్ మినహాయింపు కొనసాగుతుంది. వీటి విషయంలో ఎటువంటి సవరణలు చేయలేదు ప్రభుత్వం.

Karnataka Ends 100 Road Tax Exemption for EVs with New Price Linked Rates 2 Wheelers Stay Exempt

ఈ నిర్ణయంతో ప్రతి సంవత్సరం రాష్ట్రానికి సుమారు 250 కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా. పన్ను మార్పు రాకముందే ఈవీ కొనుగోళ్లు పెరిగాయని వాహన్ పోర్టల్ డేటా వెల్లడించింది. ఈ ఏడాది జనవరిలో 3,972 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఫిబ్రవరిలో వీటి సంఖ్య 3,606 లుగా నమోదైంది. మార్చిలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు అమాంతం పెరిగాయి. ఏకంగా 4,663 యూనిట్లు అమ్ముడయ్యాయి.

ధరలు పెరుగుతాయని డీలర్లు కొనుగోలుదారులకు సూచించడంతో ముందస్తు కొనుగోళ్లు జోరుగా సాగాయి. దీనికి అనుగుణంగా రోడ్ ట్యాక్స్ రద్దయింది. వాస్తవానికి ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించడానికి అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు పన్ను మినహాయింపు ఇచ్చింది కర్ణాటక ప్రభుత్వం 2016లో. అప్పటి విధానంలో 25 లక్షల రూపాయలకు మించిన ఈవీలకు మాత్రమే జీవితకాల పన్ను ఉండేది.

పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో ఈవీలకు మారాలని వినియోగదారులు భావిస్తున్న వేళ ఇప్పుడున్న పన్నుల ఉపసంహరణ ఒక కీలక విధాన మార్పుగా భావిస్తోన్నారు. ఈ నిర్ణయం ఈవీ తయారీదారులు, కొనుగోలుదారులలో ఆందోళనలను రేకెత్తించింది. దీనివల్ల ఈవీలను కొనుగోలు చేయడానికి వాహనదారులు పెద్దగా చొరవ చూపబోరనే అభిప్రాయాలు ఉన్నాయి. తాజా నిర్ణయం- రాష్ట్రంలో వాటి వృద్ధి వేగాన్ని ప్రభావితం చేయవచ్చనే వాదనలు లేకపోలేదు.

రిజిస్ట్రేషన్ల పరంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత దేశంలో నాలుగో అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల అమ్ముడయ్యేది కర్ణాటకలోనే. చాలా రాష్ట్రాలు ఈవీలకు పన్ను మినహాయింపులు లేదా రాయితీలు ఇస్తుండగా, గుజరాత్, కేరళ వంటి కొన్ని రాష్ట్రాలు మాత్రం పన్నులు వసూలు చేస్తున్నాయి. మోటారు వాహన పన్ను రాష్ట్రానికి ముఖ్యమైన ఆదాయ వనరు కావడం దీనికి ప్రధాన కారణం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+