కర్ణాటక ఎన్నికలు: చాణక్య సర్వేలో కాంగ్రెస్ కు అధిక సీట్లు, జెడి(ఎస్) కింగ్ మేకర్
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో శనివారం నాడు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తోందో అనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. అధికారాన్ని నిలుపుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నం చేసింది. ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని తేల్చింది. కాంగ్రెస్ పార్టీ 90 నుండి 103 సీట్లను కైవసం చేసుకొంటుందని ఈ సర్వే తేల్చింది
అయితే ఓటరు తీర్పు మాత్రం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. అయితే చాణక్య సర్వే ప్రకారంగా బిజెపికి 80 నుండి 90 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి సీట్లు 90 నుండి 103 జెడిఎస్ కు 31 నుండి 39 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే తేల్చి చెప్పింది. మరో వైపు ఇతరులకు 2 నుండి 4 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తేల్చి చెప్పింది.

అయితే కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద పార్టీ అవతరించనుంది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సీట్లు రావని ఈ సర్వే తేల్చి చెప్పింది. అయితే ఈ ఎన్నికల్లో జెడి (ఎస్) కీలకంగా మారే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రీ పోల్స్ సర్వే ప్రకారంగానే జెడి ఎస్ ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్ గా అవతరించే అవకాశం లేకపోలేదు.












Click it and Unblock the Notifications