వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ సీఎం అరెస్టు అంటూ మీడియాలో పుకార్లు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అక్రమ గనుల కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందం పోలీసులు కర్ణాటక ముఖ్యమంత్రి, విధాన సభలో ప్రతిపక్ష నాయకుడు (జేడీఎస్)హెచ్.డి. కుమారస్వామిని అరెస్టు చేశారని మీడియాలో వార్తలు రావడంతో ఆ పార్టీ నాయకులు షాక్ కు గురైనారు.

శనివారం కుమారస్వామి బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. తనని అరెస్టు చేశారని ప్రచారం చేసి బీబీఎంపీ ఎన్నికలలో లబ్ధిపొందాలని కొందరు ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకుల మీద మండిపడ్డారు.

HD Kumaraswamy

ఈనెల 5వ తేదిన ఎస్ఐటి అధికారులు కుమారస్వామిని అరెస్టు చేసి జామీను మీద విడుదల చేశారని ప్రచారం సాగింది. ఎవరు పుకార్లు పుట్టించారో తనకు అర్థం కావడంలేదని కుమారస్వామి అన్నారు. జేపీ నగరలోని తన ఇంటికి సిట్ అధికారులు వచ్చిన మాట వాస్తవమేనని చెప్పారు.

అంతే కాకుండా తాను సిట్ కార్యాలయానికి వెళ్లానని కుమారస్వామి స్పష్టం చేశారు. అయితే తనను ఎవరు అరెస్టు చెయ్యలేదని, బీబీఎంపీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో పుకార్లు పుట్టించారని చెప్పారు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జంతకల్ గనులు అక్రమంగా లీజుకు ఇచ్చి అధికార దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. కేసు విచారణలో ఉంది.

English summary
Janata Dal (Secular) state president and former Karnataka chief minister HD Kumaraswamy denied the reports of media Special Investigation Team (SIT) probing illegal mining case arrested him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X