నటి రమ్య వయ్యారంగా తిప్పుకోని తిరుగుతుంది: సీఎం సిద్దూ హిట్లర్, హిందువుల దెబ్బకు!
బెంగళూరు: మండ్య మాజీ ఎంపీ, నటి రమ్యకు వయ్యారంగా తిప్పుకోని తిరగడం తప్పా దేశం, ప్రజల గురించి ఏమీ తెలీదని, ఆమె మండ్య ప్రజలతో పాటు దేశానికి ఏం సేవ చేశారో చెప్పాలని కర్ణాటక మాజీ మంత్రి సూగడు శివన్న ప్రశ్నించారు. సీఎం సిద్దరామయ్య హిట్లర్ లా మఠాలు స్వాధీనం చేసుకోవడానికి చూస్తే హిందువల దెబ్బకు దిమ్మతిరుగుతుందని మాజీ మంత్రి శివన్న హెచ్చరించారు.
Recommended Video


సినిమాల్లో నటిస్తుంది
రమ్య సినిమాల్లో నటిస్తూ వయ్యారంగా తిప్పుకుని తిరుగుతుందని, ఆమెకు నటన మాత్రమే తెలుసని మాజీ మంత్రి సూగడు శివన్న అన్నారు. అంతే కాని సమాజం, ప్రజాప్రభుత్వం గురించి రమ్యకు ఎలాంటి అవగాహనలేదని సూగడు శివన్న చెప్పారు.

120 కోట్ల మందికి అవమానం
రమ్య గురించి ఎక్కువ మాట్లాడి, ఆమెకు చాలా ప్రాధాన్యం ఇస్తే దేశంలోని 120 కోట్ల మందిని అవమానం చేసినట్లు అవుతోందని సూగడు శివన్న అన్నారు. ప్రధాని గురించి మాట్లాడే రమ్య దేశానికి ఏం బహుమతి ఇచ్చిందో చెప్పాలని మాజీ మంత్రి సూగడు శివన్న డిమాండ్ చేశారు.

సీఎం సిద్దూ హిట్లర్
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య హిట్లర్ (సర్వాధికారి) అని మాజీ మంత్రి సూగడు శివన్న ఆరోపించారు. కర్ణాటక ప్రజలను సర్వనాశనం చెయ్యడానికి సిద్దరామయ్య ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి సూగడు శివన్న మండిపడ్డారు.

హిందువులు నాశనం
1975లో వాక్ స్వాతంత్రాన్ని నాశనం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు హిందువులను నాశనం చెయ్యడానికి సిద్దం అయ్యారని సూగడు శివన్న ఆరోపించారు. అందుకే సిద్దరామయ్య ప్రభుత్వం హిందూ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోందని శివన్న ధ్వజమెత్తారు.

భిక్షం ఎత్తుకుని కట్టారు
కర్ణాటకలోని మఠాలను సిద్దరామయ్య ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని సూగడు శివన్న ఆరోపించారు. సమాజం, ఆచారం కాపాడుకోవడానికి భిక్షం ఎత్తుకుని మఠాలు నిర్మిస్తే వాటిని దేవాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకురావడానికి ప్రత్యేక చట్టం తీసుకురావడానికి సిద్దరాయ్య ప్రభుత్వం ప్రయత్నిస్తోందని శివన్న ఆరోపించారు.

ఇందిరా క్యాంటిన్
సిద్దగంగా మఠంలోని త్రివిధ దాసోహం పథకాన్ని చూసి కర్ణాటక ప్రభుత్వం ఇందిరా క్యాంటిన్ లు ఏర్పాటు చేసిందని, కొత్తగా ప్రభుత్వం కనిపెట్టింది ఏమీ లేదని మాజీ మంత్రి సూగడు శివన్న ఆరోపించారు. సిద్దరామయ్య ప్రభుత్వం ఆటలు ఇక 90 రోజులు మాత్రమే సాగుతాయని శివన్న గుర్తు చేశారు.

హిందువుల దెబ్బకు!
కర్ణాటకలోని మఠాలకు వివిధ పద్దతులు, ఆచారాలు, కట్టుబాట్లు ఉన్నాయని, వాటన్నింటినీ దేవాదాయశాఖ స్వాధీనం చేసుకుని హిందూ ధర్మన్ని నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్తే సిద్దరామయ్య ప్రభుత్వానికి హిందువులు కచ్చితంగా తగిన బుద్దిచెబుతారని మాజీ మంత్రి సూగడు శివన్న హెచ్చరించారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications