బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిల్డర్లు, రియల్టర్లతో భేటీ..రాజకీయ ఒత్తిళ్లు: వలస కార్మికులకు షాక్: అన్ని శ్రామిక్ రైళ్లు రద్దు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: వలస కార్మికులను స్వస్థలాలకు తరలించడానికి రైల్వేశాఖ నడిపిస్తోన్న శ్రామిక్ స్పెషల్ రైలు సర్వీసులన్నింటినీ కర్ణాటక ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. బుధవారం నుంచి పట్టాలెక్కాల్సిన మూడు శ్రామిక్ స్పెషల్ రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించింది. దీనితో వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించే కార్యక్రమాలను నిలిపివేసినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. దీని వెనుక బిల్డర్లు, రియల్టర్లు, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి.

తెలంగాణలో ఎగబడి మద్యం కొనాలంటే కష్టమే: మందుబాబుల బెండు తీసేలా: చీప్ లిక్కర్ కూడా కాస్ట్లీతెలంగాణలో ఎగబడి మద్యం కొనాలంటే కష్టమే: మందుబాబుల బెండు తీసేలా: చీప్ లిక్కర్ కూడా కాస్ట్లీ

వలస కార్మికుల తరలింపునకు బ్రేక్..

వలస కార్మికుల తరలింపునకు బ్రేక్..

భారత రియల్ ఎస్టేట్ డెవలపర్ల అసోసియేషన్ల సమాఖ్య (క్రెడాయ్) ప్రతినిధులతో సమావేశమైన అనంతరం కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. క్రెడాయ్ తరఫున పలువురు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పను కలిసిన అనంతరం ఈ నిర్ణయం వెలువడిందని అంటున్నారు. వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపిస్తే.. నిర్మాణరంగం కుదేల్ అవుతుందనే ఉద్దేశంతోనే బీజేపీ ప్రభుత్వం శ్రామిక్ రైళ్లను రద్దు చేసినట్లు చెబుతున్నారు.

 నిర్మాణ రంగం జోరుగా..

నిర్మాణ రంగం జోరుగా..

కర్ణాటకలో ప్రత్యేకించి- బెంగళూరులో నిర్మాణ రంగం ఆకాశమే హద్దుగా కొనసాగుతోంది. బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్ జిల్లాల్లో వందలాది లగ్జరీ అపార్ట్‌మెంట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి పునాది కూడా పడక ముందే ఫ్లాట్ల విక్రయాలను ఆరంభించారు బిల్డర్లు. అవన్నీ నిర్ణీత గడువు నాటికి పూర్తి కావాల్సి ఉన్నవే. కరోనా వైరస్ ప్రభావం, లాక్‌డౌన్ పరిస్థితులు లేకపోయి ఉంటే.. ఈ అయిదారు నెలల వ్యవధిలో పలు అపార్ట్‌మెంట్ల నిర్మాణం పూర్తయి ఉండే అవకాశాలు లేకపోలేదు. వాటి నిర్మాణం పూర్తి కావాలంటే.. వలస కార్మికులు ఉండి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తరలించడం వల్ల తీవ్ర నష్టం

తరలించడం వల్ల తీవ్ర నష్టం

..
బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాలకు చెందిన వేలాదిమంది వలస కార్మికులు భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి అమలు చేస్తోన్న లాక్‌డౌన్ వల్ల నిర్మాణ రంగం స్తంభించిపోయింది. వలస కార్మికులు ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. ఆ ఆపత్కాల సమయంలో బిల్డర్లు గానీ, రియల్ ఎస్టేట్ డెవలపర్లు గానీ వారిని ఆదుకోలేదు. దీనితో వారంతా స్వస్థలాలకు తిరుగుప్రయాణం అవుతున్నారు. ఇప్పటికే మూడు వేల మందికి పైగా వలస కార్మికులు బెంగళూరును వీడారు.

Recommended Video

Liquor bill Of Rs 52842 Goes Vral, Karnataka Excise Dept Books Case | Oneindia Telugu
లాక్‌డౌన్ ముగింపు దశలో..

లాక్‌డౌన్ ముగింపు దశలో..

లాక్‌డౌన్ దాదాపు ముగింపు దశకు వచ్చిన సమయంలో వలస కార్మికులకు వారి స్వస్థలాలకు పంపించడం వల్ల మున్ముందు నిర్మాణరంగంలో పనులు కొనసాగడం కష్టతరమౌతుందనే ఆందోళనలు క్రెడాయ్ ప్రతినిధుల్లో వ్యక్తమౌతోందని, అందుకే వారు హుటాహుటిన ముఖ్యమంత్రిని కలిసి, పరిస్థితిని వివరించారని అంటున్నారు. వారితో ఏకీభవించిన ప్రభుత్వం.. వలస కార్మికుల తరలింపును నిలిపివేసిందని చెబుతున్నారు. షెడ్యూల్ ప్రకారం.. బుధవారం మూడు శ్రామిక్ స్పెషల్ రైళ్లు బిహార్, జార్ఖండ్‌లకు బయలుదేరి వెళ్లాల్సి ఉంది. వాటిని రద్దు చేసినట్లు నోడల్ అధికారి ఎన్ మంజునాథ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

English summary
Hours after Karnataka Chief Minister B S Yediyurappa met leading property developers of the state, the government has decided to cancel all trains that were to ferry migrant workers to their home town from Wednesday, 6 May. The state government has written to Indian Railways cancelling all trains scheduled from Wednesday. This decision comes even as several migrant workers are struggling to find a train to return home. N Manjunath Prasad, nodal officer for inter-state travel from the state, claiming that no more trains are required. Referring to an earlier letter requesting three trains on 6 May, the officer said that the service is no longer necessary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X