ఒకేసారి 50 లక్షల మందిని టార్గెట్ చేసిన ప్రధాని మోదీ, చాన్స్ మిస్ అయితే కష్టం !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో మరోసారి అధికారంలోకి రావాలని లక్షంగా చేసుకున్న బీజేపీ నాయకులు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ ఒకేసారి 50 లక్షల మంది కార్యకర్తలతో మాట్లాడానికి అన్ని ఏర్పాట్లు చెయ్యడం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.
ఇక ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ కూడా మేము ఏం తక్కువ తినలేదని ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సమయం తక్కువ ఉండటంతో బీజేపీ నాయకులు వీలైనంత త్వరంగా ఓటర్లను ఆకట్టుకోవడానికి, మరోసారి అధికారంలోకి రావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
బీజేపీకి పెద్ద దిక్కు అయిన ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి ఒకేసారి 50 లక్షల మందితో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడటానికి ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 27వ తేదీన కర్ణాటకలోని 50 లక్షల మందితో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడటానికి సర్వం సిద్దం చేశారు.

58, 112 బూత్ కమిటీల్లోని బీజేపీ కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్లొంటారని కేంద్ర మంత్రి శోభా కరందాజ్లే బుధవారం మీడియాకు చెప్పారు. కర్ణాటకలో మరోసారి బీజేపీని ఎలా అధికారంలోకి తీసుకురావాలి అనే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ కార్యకర్తలకు సూచనలు, సలహాలు ఇస్తారని కేంద్ర మంత్రి శోభా కరందాజ్లే అన్నారు.
కర్ణాటకలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి రావడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి. కేంద్ర ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం ఇంతకాలం పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన అనేక పథకాలు గురించి ప్రజలకు ఎలా వివరించాలో ప్రధాని నరేంద్ర మోదీ ఇదే సమయంలో బీజేపీ కార్యకర్తలకు వివరిస్తారని బీజేపీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మంత్రి శోభా కరందాజ్లే చెప్పారు.
మొత్తం మీద ఒకేసారి 50 లక్షల మందితో ప్రధాని నరేంద్ర మోదీ చర్చా గోష్టి కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది. కర్ణాటకలో ఎలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా చెయ్యాలని బీజేపీ నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కన్నడిగులు ఎవరిని ఆధరిస్తారు ? అనే విషయం మే 13వ తేదీన తేలిపోనుంది.












Click it and Unblock the Notifications