ఎన్‌కౌంటర్‌పై కరుణ సీరియస్, బాబుకు తమిళ సీఎం లేఖ: చింతా తీవ్ర వ్యాఖ్య
చెన్నై/తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా శేషాచలం అడవులలో జరిగిన ఎన్‌కౌంటర్ వివాదాస్పదమవుతోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధ్యక్షుడు కరుణానిధి మంగళవారం ఖండించారు. గత రెండు నెలలుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు (తమిళనాడు, ఆంధ్రప్రదేశ్) అదుపు చేయలేకపోతున్నాయన్నారు.
ఇప్పుడు ఇరవై మంది బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఘటనలు జరుగుతున్న సమయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలే జరపలేదన్నారు. మృతుల కుటుంబానికి తాను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు ఇరు రాష్ట్రాలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు.
తమిళనాడు ప్రభుత్వం రహస్య విచారణ?
శేషాచలం అడవులలో జరిగిన ఎన్ కౌంటర్ పైన తమిళనాడు ప్రభుత్వం రహస్య విచారణకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. సంఘటన స్థలాన్ని తమిళనాడు పోలీసులు మంగళవారం సందర్శించారు. దీనిపై వారు విచారిస్తున్నారని తెలుస్తోంది.
బాబుకు పన్నీరు సెల్వం లేఖ
తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. మృతుల కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరారు. పూర్తిస్థాయి విచారణ జరిపించలని చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

చంద్రబాబు సమీక్ష
శేషాచలం ఎన్ కౌంటర్ పైన ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అనంతరం గవర్నర్ నరసింహన్‌తో ఈ విషయమై ఫోన్లో చర్చించారు.
చేతులు కట్టేసి కాల్చేసినట్లుగా: చింతా మోహన్
శేషాచలం కొండల్లో జరిగిన ఎన్ కౌంటర్ పైన మాజీ ఎంపీ చింతా మోహన్ తీవ్రంగా మండిపడ్డారు. చేతులు కట్టేసి మరీ కాల్చినట్లుగా ఉందని ఆరోపించారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన అన్నారు. కారంచేడు తర్వాత ఇదే అతిపెద్ద బూటకపు ఎన్‌కౌంటర్ అని ఆరోపించారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!










Click it and Unblock the Notifications