ఆ బ్రిడ్జికి కసబ్ పేరు ..? ఎందుకొచ్చిందంటే ..?

ముంబై : ముంబైలో ఎప్పుడూ రద్దీగా ఉండే బ్రిడ్జీ కూలి, ఆరుగురు మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ బ్రిడ్జికి ఉగ్రవాది అజ్మల్ కసబ్ బ్రిడ్జ్ అని పేరు ఉంది. సీఎస్టీ నుంచి టైమ్స్ ఆఫ్ ఇండియా భవనం వైపు వెళ్లే ఈ పాదచారుల వంతెనను కసబ్ ఉపయోగించడంతో దానిని కసబ్ బ్రిడ్జిగా పిలుస్తారు.

Kasab shadow loomed over bridge

కసబ్ బ్రిడ్జిగా హిమాలయ బ్రిడ్జి ..
వాస్తవానికి ఈ బ్రిడ్జి పేరు హిమాలయ బ్రిడ్జి. కానీ కాలక్రమంలో కసబ్ బ్రిడ్జిగా పేరుగడించింది. 2008 నవంబర్ 26న ముంబైలోని తాజ్ హోటల్ పై దాడిచేసేందుకు ఈ బ్రిడ్జిపై నుంచే కసబ్ వెళ్లాడు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కడంతో హిమాలయ బ్రిడ్జి కాస్త .. కసబ్ బ్రిడ్జిగా మారిపోయింది.

Kasab shadow loomed over bridge

సీఎస్ఎంబీ స్టేషన్, హాస్పిటల్ వద్ద కాల్పులు

ముంబై తాజ్ హోటల్ పై దాడుల చేసిన అనంతరం అజ్మల్ కసబ్, అబు ఇస్మాయిల్ సీఎస్ఎంటీ స్టేషన్ వద్ద కూడా కాల్పులు జరిపారు. ఎఫ్ఓబీ గుండా స్టేషన్ బయటకొచ్చి .. బీటీ లేన్ వద్దకు చేరుకున్నారు. అంజుమాన్ ఇ ఇస్లాం స్కూల్, టైమ్స్ ఆఫ్ ఇండియా భవనం వద్ద కాసేపు ఉండి ... తర్వాత టైమ్స్ భవనంపై కూడా కాల్పులు జరిపారు. బీటీ లేన్ వద్ద ఓ కుటుంబాన్ని తమకు దాహం వేస్తుందని మంచినీరు అడిగారు. అటునుంచి అల్బీస్ హాస్పిటల్ వద్దకు చేరి .. భీతావాహంగా కాల్పులు జరిపారు. ఆస్పత్రి నుంచి బయటకొచ్చి జరిపిన కాల్పుల్లో యాంటీ టెర్రరిజం స్వ్కాడ్ చీఫ్ హేమంత్ కార్కెపై కాల్పులు జరుపడంతో వీరమరణం పొందిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+