కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా కొద్దిరోజులే.. రాష్ట్రంగా మారుస్తామని మోడీ ప్రతీన

న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌లో పరిస్థితులు సద్దుమణిగాక రాష్ట్రంగా మారుస్తామని హామీనిచ్చారు ప్రధాని మోడీ. దేశంలో ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఇక్కడ కూడా ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి ఉంటారన్నారు. కశ్మీర్, లడాఖ్ రాష్ట్రాలుగా మారుస్తామని .. దీనిపై హామీనిస్తున్నామని మీడియాముఖంగా చెప్పారు. ఇన్నాళ్లు 370 ఆర్టికల్‌తో కశ్మీర్ వెనుకబాటునకు గురైందన్నారు. కానీ నేటితో కశ్మీర్‌లో నవయుగం ఆవిష్కృతమవుతుందన్నారు. కశ్మీరీ ప్రజలకు అన్నివిధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు మోడీ.

 స్వార్థ ప్రయోజనాల కోసమే ..

స్వార్థ ప్రయోజనాల కోసమే ..

ఆనాటి నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం కశ్మీర్‌ను వదిలేశారని విమర్శించారు. కానీ తాము అలా చేయబోమని పేర్కొన్నారు. కశ్మీర్‌లో ఇప్పటివరకు విద్యహక్కు చట్టం అమలు కాలేదన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లకు కూడా దూరంగా ఉన్నారని పేర్కొన్నారు. కశ్మీర్ విభజనతో పారదర్శక పాలన అందిస్తామని ప్రతీనబూనారు మోడీ. కశ్మీర్‌లో సుపరిపాలన అందించి .. ఆదర్శంగా నిలుస్తామన్నారు.

కూకటివేళ్లతో పెకిలిస్తాం ..

కూకటివేళ్లతో పెకిలిస్తాం ..

కశ్మీర్‌లో త్వరలో వేర్పాటువాదం, ఉగ్రవాదం అంతమవుతుందన్నారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తామని పేర్కొన్నారు. సినిమా షూటింగులుకు కూడా తోడ్పాటును అందిస్తామన్నారు ప్రధాని మోడీ. కశ్మీర్, లడఖ్‌లో సినిమా షూటింగులు జరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటికే బాలీవుడ్ సినిమాలను తెరకెక్కిస్తున్నారని .. తర్వలో తెలుగు, తమిళ సినిమాలు కూడా చిత్రీకరిస్తున్నానని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. కశ్మీర్ ప్రజలకు సమాన ఉద్యోగవకాశాలు లభిస్తాయన్నారు.

ఆసక్తిగా తిలకించిన ప్రజలు ..

ఆసక్తిగా తిలకించిన ప్రజలు ..

ప్రధాని మోడీ 37 నిమిషాల పాటు కశ్మీర్ గురించి ప్రసంగించారు. ప్రధాని మోడీ ప్రసంగాన్ని లడాఖ్, కశ్మీర్ ప్రజలు ఆసక్తిగా గమనించారు. కేంద్రపాలిత ప్రాంతంగా చేయడంతో ఇప్పటివరకు అనుమానం ఉందని .. కానీ మోడీ ప్రసంగంతో కాస్త స్వాంతన చేకూరిందన్నారు. విద్యాహక్కు చట్టం ఓకే కానీ ... యూటీతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కశ్మీర్ విభజనతో సంతోషంగా ఉన్నామని .. కానీ యూటీతో ఏం జరుగుతుందో అనే సందేహం నెలకొందన్నారు. జమ్ము కశ్మీర్ విభజన చేసే సమయంలో చాలా ఆలోచించామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. కశ్మీర్ ప్రజల మేలు కోసమే నిర్ణయం తీసుకున్నామన్నారు. కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించే ప్రయోజనాలు కశ్మీర్ ఉద్యోగులకు వర్తిస్తాయని స్పష్టంచేశారు. కశ్మీర్ ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తేల్చిచెప్పారు. దీంతోపాటు పర్యాటక రంగం కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+