తల్లి కంటతడి: ఉగ్రవాదాన్ని వదిలేసిన ఫుట్‌బాలర్ మజీద్ ఖాన్
ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాలో చేరిన 20ఏళ్ల జమ్మూకాశ్మీర్ ఫుట్‌బాల్(గోల్ కీపర్) ఆటగాడు మజీద్ ఖాన్ పోలీసులు ఎదుట లొంగిపోయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
శ్రీనగర్: ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాలో చేరిన 20ఏళ్ల జమ్మూకాశ్మీర్ ఫుట్‌బాల్(గోల్ కీపర్) ఆటగాడు మజీద్ ఖాన్ పోలీసులు ఎదుట లొంగిపోయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అనంత్‌నాగ్‌కు చెందిన మజీద్ ఇటీవల తన కుటుంబాన్ని విడిచిపెట్టి ఎల్‌ఈటీలో చేరినట్లు సామాజిక మాధ్యమాల్లో అతడి ఫొటోలు వైరల్‌గా మారాయి.
జమ్మూకాశ్మీర్ భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో అతడి స్నేహితుడు యశ్వర్ నిసర్ ప్రాణాలు కోల్పోవడంతో మజీద్ ఉగ్రవాదంవైపు మళ్లాడు. ఈ నేపథ్యంలోనే నాలుగు రోజుల క్రితం అతడు ఇంటి నుంచి వెళ్లిపోయి మిలిటెంట్లలో కలిశాడు.

ఒక్కగానొక్క కుమారుడు కుటుంబాన్ని వదిలి ఉగ్రవాదంలో చేరడంతో అతడి తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. దీంతో అతడి స్నేహితులు, కుటుంబసభ్యులు మజీద్‌ను వెనక్కి తిరిగి వచ్చేయాల్సిందిగా కోరుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు.
అంతేగాక, కాశ్మీర్ అంతటా పోస్టర్లు అతికించారు. ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి మజీద్ దక్షిణకాశ్మీర్‌లోని భద్రతా సిబ్బంది క్యాంప్‌కు వెళ్లి లొంగిపోయినట్లు అధికారులు తెలిపారు. అతను తన దగ్గర ఉన్న ఓ ఆయుధాన్ని కూడా పోలీసులకు అందజేశాడు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications