ఎట్టకేలకు సీఎం కేజ్రీవాల్ కారు దొరికింది: ఎక్కడంటే..?

Recommended Video

    CM's stolen Blue Wagon R found ఎట్టకేలకు సీఎం కారు దొరికింది: ఎక్కడంటే..?

    న్యూఢిల్లీ: రెండ్రోజుల క్రితం చోరీకి గురైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కారు ఎట్టకేలకు దొరికింది. శనివారం ఘజియాబాద్‌లోని మోహన్‌ నగర్‌ సమీపంలో కారును పోలీసులు గుర్తించారు. అయితే.. కారును ఎవరు దొంగిలించారనే విషయం మాత్రం తెలియలేదు.

    రెండు రోజుల క్రితం కేజ్రీవాల్‌ ఉపయోగించిన నీలం రంగు వ్యాగన్‌ఆర్‌ కారు ఢిల్లీ సచివాలయం ప్రాంగణలోనే అపహరణకు గురైన విషయం తెలిసిందే. దీనిపై కేజ్రీవాల్‌ ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ను ప్రశ్నించారు.

    'కారుకే భద్రత లేకపోతే.. ఇక సామాన్యుడి మాటేంటి? కారు పోవడం చిన్న విషయమే.. కానీ అది సచివాలయం ఎదుట పోయింది. ఢిల్లీలో శాంతి, భద్రతలు గాడితప్పుతున్నాయనడానికి ఈ ఘటన నిదర్శనం' అంటూ కేజ్రీవాల్‌ ఎల్‌జీకి రాసిన లేఖలో విమర్శించారు.

    కాగా, 2013లో కుందర్‌ శర్మ అనే ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆ కారును కేజ్రీవాల్‌కు విరాళమిచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కేజ్రీవాల్‌ ఆ కారును ఉపయోగించారు. ఆ కారుని ప్ర‌స్తుతం ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వాలంటీర్లు ఉప‌యోగిస్తున్నార‌ని తెలిసింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+