మోడీపై పొగడ్తలు ఆపండి: శశిథరూర్‌కు కేరళ కాంగ్రెస్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా చేస్తున్న పొగడ్తలు ఆపాలని మాజీ కేంద్రమంత్రి శశిథరూర్‌కు కేరళ కాంగ్రెస్ పార్టీ సూచించింది. భారతీయ జనతా పార్టీకి శశిథరూర్ మద్దతు పలకడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొంది.
ఇటీవల మోడీ చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మెచ్చుకుంటూ శశిథరూర్ ట్వీట్ చేశారు. అంతకుముందు కూడా మోడీపై పలుమార్లు శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని మోడీ ఇచ్చిన పిలుపును తాను స్వీకరిస్తున్నట్లు తెలిపారు.

తాను దేశం కోసమే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నానని చెప్పారు. తాను భారతీయుడిగా గర్విస్తానని, కాంగ్రెస్ వ్యక్తిగా జీవిస్తానని అన్నారు. తాను బిజెపికి మద్దతు పలకడం లేదని.. దేశం కోసమే మద్దతు పలుకుతున్నట్లు చెప్పారు.
కాగా, కేరళ కాంగ్రెస్ నాయకుడు ఎంఎం హసన్ మాట్లాడుతూ.. శశిథరూర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీని ప్రశంసించడం థరూర్ ఇకనైనా మానుకోవాలని సూచించారు. ఇది అతనికి సరికాదని అన్నారు. దీనిపై రాష్ట్ర పార్టీ చర్చిస్తోందని తెలిపారు.












Click it and Unblock the Notifications