కేరళ : చిల్డ్రన్స్ డే రోజు మానవమృగానికి ఉరిశిక్ష..
దేశవ్యాప్తంగా చిల్డ్రన్స్ డే జరుపుకుంటోన్న ఈ తరుణంలో ఓ మానవమృగానికి కేరళ కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పను వెల్లడించింది. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి పాశవికంగా కడతేర్చిన నిందితుడికి పిల్లల దినోత్సవం రోజే ఈ తరహా శిక్ష విధించడంపై సార్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది జులై 28న కేరళ రాష్ట్రం కొచ్చి సమీపంలో అలువాలో నివాసం ఉంటున్న బిహార్కు చెందిన ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్కు గురయ్యింది. ఆ చిన్నారికి స్వీట్లు ఆశ చూపించిన నిందితుడు తనతోపాటు తీసుకెళ్లాడు. అనంతరం చిన్నారిపై దారుణంగా అత్యాచారం చేసి గొంతుకోసి హత్య చేశాడు. తర్వాత బాలిక మృతదేహాన్ని నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. మరుసటి రోజు చిన్నారి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మృతదేహం ఉన్న పరిస్థితిని చూసి ఖాకీలు సైతం చలించిపోయారు. ముమ్మర దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. నవంబర్ 4వ తేదీన ఈ కేసులో అస్ఫాక్ ఆలమ్ అనే వ్యక్తిని దోషిగా నిర్థారించి ఎర్నాకులం పోక్సో కోర్టు ఉరిశిక్షతో పాటు ఆరు లక్షల రూపాయల జరిమానా కూడా విధిస్తూ మంగళవారం తీర్పు ఇచ్చింది.

సమాజంలో బతికే అర్హత లేదు : బిహార్కు చెందిన బాలిక కుటుంబం అలువాలో నివాసం ఉంటోంది. ఈ కేసు విషయంలో నిందితుడు మానవ మృగంలా ప్రవర్తించాడని, ఇలాంటి వ్యక్తులకు సమాజంలో బతికే అర్హత లేదని అందుకే హత్యాచారానికి పాల్పడ్డ ఆలమ్ను ఉరితీయాలని ప్రత్యేక పోక్స్ కోర్టు జడ్జి కె.సోమన్ ఆదేశించినట్లు ప్రభుత్వ న్యాయవాది జి.మెహన్రాజ్ వెల్లడించారు. కేరళ హైకోర్టు నిర్థారించిన తర్వాత మరణశిక్ష అమలు అవుతుందని ఆయన తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి, పోక్సో చట్టం ప్రకారం నిందితుడికి కోర్టు జీవిత ఖైదు విధించినట్లు వెల్లడించారు. బాలల దినోత్సవం రోజు వెలువడిన ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా చర్చ మొదలయ్యింది. ఈ తరహా కేసుల విషయంలో సత్వర పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన ప్రాముఖ్యతపై పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications