Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేరళ కొంప ముంచిన ఓనం పండుగ ; కేరళ కరోనా కల్లోలంతో పండుగలపై కేంద్రం అలెర్ట్

కరోనా మహమ్మారి విజృంభణ కాస్త తగ్గుతుంది అనుకున్న భారతదేశానికి కేరళ రాష్ట్రం ఆందోళన కలిగిస్తుంది. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు దేశానికి పెద్ద కష్టాన్ని తెచ్చి పెడుతున్నాయి. కేరళలో కేసుల పరిస్థితి మూడవ వేవ్ సంకేతంగా గతంలోనే కేంద్ర నిపుణుల బృందం పేర్కొంది. ఇప్పుడు తాజాగా కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, నిత్యం విపరీతంగా నమోదవుతున్న కేసులు కరోనా థర్డ్ వేవ్ ఆందోళనను మరింత పెంచుతున్నాయి.
ఓనం పండుగ తాజాగా కేసుల పెరుగుదలకు కారణమని తెలుస్తుంది. కేరళ కరోనా కల్లోలంతో పండుగలపై అన్ని రాష్ట్రాలను కేంద్రం అలెర్ట్ చేసింది.

నిన్న 68 శాతం కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలోనే

నిన్న 68 శాతం కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలోనే

గత 24 గంటల్లో భారతదేశంలో 46,164 కొత్త కరోనావైరస్ వ్యాధి (కోవిడ్ -19) నమోదైందని, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3,25,58,530 కు చేరుకుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, భారతదేశంలో గురువారం నమోదైన కేసులలో 68 శాతం కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకారం, దక్షిణ రాష్ట్రంలో బుధవారం 31,445 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఇది ఇప్పటివరకు నమోదైన మూడు నెలల కేసులలో అత్యధికం కావడం గమనార్హం.

ఎర్నాకుళం, త్రిశ్సూర్ లో భారీగా కేసులు నమోదు

ఎర్నాకుళం, త్రిశ్సూర్ లో భారీగా కేసులు నమోదు

ఎర్నాకుళం, త్రిశ్సూర్ లో భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. ఎర్నాకుళంలో 4,048 కేసులు నమోదు కాగా , త్రిస్సూర్ 3,865 కేసులతో అత్యధికంగా ప్రభావితమైన జిల్లాగా ఉంది. కేరళలో టెస్ట్ పాజిటివిటీ రేటు 19.03%, ఇది కూడా గత మూడు నెలల్లో అత్యధికం. గత వారం జరుపుకున్న ఓనమ్ పండుగ ఈ కేసుల పెరుగుదలకు కారణమని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఓనమ్ తర్వాత కేసులు పెరుగుతాయని ముందుగానే ఊహించామని, తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పండుగ సమయంలో ప్రజల తీరు కరోనా వ్యాప్తికి కారణమైందని ప్రభుత్వం చెబుతోంది. పండుగకు ముందు మార్కెట్లు కిటకిటలాడాయి. మార్కెట్లలో రద్దీ విపరీతంగా కనిపించిందని పేర్కొన్నారు.

ప్రజల నిర్లక్ష్యం వల్లే భారీగా కేసులు

ప్రజల నిర్లక్ష్యం వల్లే భారీగా కేసులు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోని ప్రజల తీరు కేసుల పెరుగుదలకు కారణమని ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త ఉత్పరివర్తన వేరియంట్ యొక్క పాత్ర వల్లనే కేరళ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు మళ్లీ మళ్లీ తిరిగబెడుతున్నాయని, కరోనా వచ్చిన వారికే మళ్ళీపునరావృతం అవుతోందని, దీనిని తోసిపుచ్చలేమని కూడా కేంద్ర నిపుణుల బృందం వెల్లడించారు. ఇక ఇదే సమయంలో పరీక్షలు మరియు వ్యాక్సినేషన్ కార్యక్రమం పెంచడానికి ఒక ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుంది. కేరళలో సెరో ప్రాబల్యం చాలా తక్కువగా ఉన్నందున, మేము త్వరగా సోకిన వారిని కనుగొని వారిని హోమ్ క్వారంటైన్ చేయాల్సి ఉంటుందని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.

కేరళ ప్రజల్లో యాంటీ బాడీలు చాలా తక్కువ

కేరళ ప్రజల్లో యాంటీ బాడీలు చాలా తక్కువ

జూలైలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిర్వహించిన నాల్గవ రౌండ్ సర్వేలో యాంటీబాడీ ప్రాబల్యం జాతీయంగా 67. 7 % అని తేలింది, అయితే కేరళలో ఇది కేవలం 42.7 % మాత్రమే, అంటే దాని జనాభాలో ఎక్కువ భాగం ఇప్పటికీ వైరస్ బారిన పడుతున్నారు అంటే అందుకు కారణం ప్రజలలో యాంటీబాడీలు ఎక్కువగా లేకపోవడమేనని తెలుస్తుంది. ఏదేమైనా, కేరళలో కేసుల పెరుగుదలకు యాంటీబాడీలు తక్కువగా ఉండడం కారణమా అనేది ఇంకా నిరూపించబడలేదు .

కేరళ పరిస్థితి నేపధ్యంలో పండుగలపై కేంద్రం అలెర్ట్

కేరళ పరిస్థితి నేపధ్యంలో పండుగలపై కేంద్రం అలెర్ట్

బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ రాబోయే పండుగ సీజన్‌లో కోవిడ్ కేసుల పెరుగుదలకు సంబంధించి రాష్ట్రాలను హెచ్చరించారు . దీనిని అరికట్టడానికి అన్ని ప్రజారోగ్య చర్యలు చేపట్టాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా ఆయన కేరళలో ఓనం పండుగ కారణంగా కేసులు పెరుగుదలను ఉదహరించారు. ఏది ఏమైనా కేరళ రాష్ట్రంలో కరోనా ను కట్టడి చేయకపోతే అది మళ్లీ దేశవ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదలకు కారణం అవుతుంది అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+