Doctor: పక్క రాష్ట్రంలో మాయం అయిన డాక్టర్ కర్ణాటకలో శవమైనాడు, మ్యాటర్ ?
బెంగళూరు/ ఉడిపి: కొన్ని రోజుల క్రితం డాక్టర్ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. డాక్టర్ ఏదో పనిమీద బయటకు వెళ్లి ఉంటారని ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు అనుకున్నారు. అయితే డాక్టర్ గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. పక్క రాష్ట్రంలో ఆ డాక్టర్ శవమై కనిపించాడు. డాక్టర్ హత్యకు గురైనాడని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే పోలీసుల విచారణలో మ్యాటర్ వేరే అని వెలుగు చూసింది. కేరళలోని కాసరగూడు జిల్లాలో డాక్టర్ క్రిష్ణమూర్తి నివాసం ఉంటున్నారు.

కొన్ని రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చిన డాక్టర్ క్రిష్ణమూర్తి తరువాత ఇంటికి వెళ్లలేదు. పోలీసులు డాక్టర్ క్రిష్ణమూర్తి కోసం గాలించారు. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కుందాపుర సమీపంలోని రైల్వే ట్రాక్ మీద డాక్టర్ క్రిష్ణమూర్తి శవమై కనిపించారు. డాక్టర్ క్రిష్ణమూర్తి హత్యకు గురైనాడని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు.
అయితే పోలీసుల విచారణలో సీన్ రివర్స్ అయ్యింది. కాసరగడూ నుంచి కుందాపుర వచ్చిన డాక్టర్ క్రిష్ణమూర్తి కేఎస్ఆర్ టీసీ బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చి పలు ప్రాంతాల్లో తిరిగాడని వెలుగు చూసింది. తరువాత డాక్టర్ క్రిష్ణమూర్తి నేరుగా రైల్వేట్రాక్ మీదకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని ఉడిపి జిల్లా పోలీసుల విచారణలో వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications