కేరళ వెబ్‌సైట్ హ్యాక్ చేసి అశ్లీల ఫోటోలు పెట్టారు

న్యూఢిల్లీ: కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అధికారిక వెబ్‌సైట్ www.keralagov.in ఆదివారం ఉదయం హ్యాకింగ్‌కు గురైంది. పాకిస్థాన్‌కు చెందిన కొందరు హ్యాకర్లు ఈ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారు. ఈ మేరకు కేరళ అధికారులు వెల్లడించారు.

పాకిస్థాన్‌కు చెందిన కొందరు హ్యాకర్లు వెబ్‌సైట్‌లోకి చొరబడి 'పాకిస్థాన్ జిందాబాద్' అని పోస్టులు పెట్టారు. దీంతో పాటు కొన్ని అభ్యంతకర ఫోటోలను పెట్టారని కేరళ ప్రభుత్వాధికారి ఒకరు స్పష్టం చేశారు. ప్రస్తుతం వెబ్‌సైట్‌ను బ్లాక్ చేశామని, సాధ్యమైనంత త్వరలో వెబ్ సైట్‌ను పునరుద్ధరిస్తామని అన్నారు.

Kerala government website hacked by Pakistani hackers

ఈ హ్యాకింగ్‌కు సంబంధించి కేరళ రాష్ట్రానికి చెందిన సైబర్ వింగ్‌తో పాటు పోలీసులు సంయుక్త దర్యాప్తును ప్రారంభించారని తెలిపారు. త్వరలోనే వెబ్‌సైట్ తిరిగి అందుబాటులోకి వస్తుందని తెలిపిన ఓ ప్రభుత్వాధికారి తగలబడిపోతున్న భారతీయ జాతీయపతకాన్ని అందులో పోస్టు చేసినట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+