పీటీ ఉషపై కేరళలో ఛీటింగ్ కేసు.. అసలు కారణం చెప్పిన మాజీ అథ్లేట్
భారత పరుగుల రాణి పీటీ ఉషపై కేరళలో ఛీటింగ్ కేసు నమోదు అయింది. ఓ ప్లాట్ విషయంలో తనును మోసం చేసిందని మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్ ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై ఐసీపీ 420 కింద కేసు నమోదు చేశారు. ఈకేసుపై త్వరలో విచారణ చేపడతామని వెల్లయిల్ పోలీసులు తెలిపారు.
కేసు నమోదుకు అసలు కారణం
కోజికోడ్‌లో మాజీ అథ్లెట్ జెమ్మాజోసెఫ్ 1,012 చదరపు అడుగుల ఫ్లాట్‌ను ఓ బిల్డర్ నుంచి కొనుగోలు చేసింది. దీని కోసం విడతల వారిగా సుమారు 46 లక్షల చెల్లించింది. అయితే ఇప్పటికీ ఆ ప్లాట్‌ను జోసెఫ్‌కు బిల్డర్ దానిని అప్పగింలేదు. పీటీ ఉష మధ్యవర్తిత్వంతో ఆ డబ్బులు బిల్డర్‌కు చెల్లించానని తెలిపింది. కానీ ప్లాట్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అడిగితే సమాధానం చెప్పడం లేదని జోసెఫ్ ఫిర్యాదులో పేర్కొంది.. బిల్డర్ , ఉష ఇద్దరు కలిసి తనను మోసం చేశారని ఆరోపించింది.

ఉషపై ఐపీసీ 420 కింద కేసు నమోదు
బిల్డర్ మోసంపై కేరళ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీకి కూడా జెమ్మా జోసెఫ్ ఫిర్యాదు చేసింది. అయినా ప్లాట్ అప్పగించేందుకు కానీ, డబ్బులు తిరిగి చెల్లించడం లేదని వాపోయింది. పీటీ ఉష దృష్టికి తీసుకెళ్లినా సమాధానం చెప్పడం లేదని పేర్కొంది. జోసెఫ్ ఫిర్యాదు మేరకు పీటీ ఉషతో పాటు మరో ఆరుగురిపై ఐపీసీ 420 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదుపై త్వరలో విచారణ చేపడతామని కోజికోడ్ పోలీసులు వెల్లడించారు. నిర్మాణ సంస్థలపై నిఘా ఉంచే కేరళ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications