వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళలో కరోనా కల్లోలం కంటిన్యూ.. 20 వేలకు దగ్గరలో కేసులు..

|
Google Oneindia TeluguNews

కేర‌ళ‌లో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది. ఇవాళ 20 వేలకు సమీపంలో కేసులు వచ్చాయి. కొత్త‌గా 19,653 మందికి పాజిటివ్ వ‌చ్చింది. పాజిటివ్ కేసుల కంటే రిక‌వ‌రీల సంఖ్య ఎక్కువ‌గా ఉంది. మొత్తం 26,711 మంది వైర‌స్ బారి నుంచి కోలుకున్నారు. దాంతో కేర‌ళ‌లో మొత్తం రిక‌వ‌రీ అయిన వారి సంఖ్య 43,10,674కు చేరింది. ఇక క‌రోనా మ‌ర‌ణాలు కూడా రోజూ భారీగానే వస్తున్నాయి. ఇవాళ కూడా 152 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 23,591కి పెరిగింది. ఇక ఇవాళ మొత్తం 1,13,295 మందికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేశారు. అందులో 19,653 మందికి పాజిటివ్ వ‌చ్చింది. అంటే కేర‌ళలో ఇవాళ క‌రోనా పాజిటివిటీ రేటు 17.34 శాతంగా ఉంది.

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు.

 Kerala reports 19,653 new Covid cases, 152 deaths

Recommended Video

Talibans వ్యాఖ్యలపై భారత్ ఫైర్.. ముందు చైనా సంగతి చూస్కోండి!! || Oneindia Telugu

ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు థర్డ్ వేవ్ అని నిపుణులు చెప్పడంతో భయాందోళన నెలకొంది.

English summary
Kerala on Sunday reported 19,653 fresh Covid-19 cases, with a test positivity rate of over 17 per cent. It also recorded 152 deaths.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X