ఏనుగు అక్రమ నిర్బంధం: సినీ నటుడిపై కేసు

తిరువనంతపురం: ఏనుగును అక్రమంగా నిర్బంధించారని కేరళ మాజీ మంత్రి, బహుభాషా నటుడు కేబి గణేష్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయనను విచారించడానికి కేరళ అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. కేసు విచారణ చెయ్యాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

1994 జనవరి నెలలలో కేబి గణేష్ కుమార్ అటవి శాఖ అధికారుల దగ్గర ఒక ఏనుగును కొనుగోలు చేశారు. తను ఏనుగును కావిలమ్మ భగవతి దేవాలయానికి కానుకగా ఇవ్వలనుకుంటున్నాని చెప్పారు. దేవాలయానికికానుక ఇస్తున్నారని భావించిన అటవి శాఖ అధికారులు సరే అన్నారు.

 Kerala's forest department will look into a complaint against former minister

ఆ మగ ఏనుగుకు ‘విశ్వనాథన్' అనే నామకరణం చేశారు. అయితే గణేష్ కుమార్ ఏనుగును కావిలమ్మ దేవాలయానికి కానుకగా ఇవ్వలేదని, అక్రమంగా నిర్బంధించి పండుగలు, ప్రత్యేక కార్యక్రమాలకు అద్దెకు ఇచ్చి డబ్బు సంపాదించుకున్నారని ఆరోపణలు వచ్చాయి.

విషయం తెలుసుకున్న కేరళ ప్రభుత్వం విచారణ చెయ్యాలని అటవి శాఖ విజిలెన్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. తరువాత నటుడు, మాజీ మంత్రి గణేష్ కుమార్ కు నోటీసులు జారీ చెయ్యాలని కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ఆదేశాలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+